పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారా? అయితే 5నెలలు ఆగాల్సిందే.!

No Dates For Marriage Till May Month. 2020 సంవత్సరంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ప్రభుత్వం లాక్ డౌన్

By Medi Samrat  Published on  31 Dec 2020 4:56 PM IST
పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారా? అయితే 5నెలలు ఆగాల్సిందే.!

2020 సంవత్సరంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది. ఒక్కసారిగా ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించడంతో ఎంతోమంది ఎన్నో శుభకార్యాలకు ఏర్పాట్లు చేసుకున్నవారు కరోనా వల్ల చాలా వరకు ఆర్థికంగా నష్టపోయారు. అదేవిధంగా కొన్ని ముహూర్తాలలో పెళ్లిళ్లు నిశ్చయించుకున్న వారు సైతం పెళ్లిని వాయిదా వేశారు. తరువాత కొద్ది నెలలకు లాక్ డౌన్ నిబంధనలు సడలించిన తరువాత కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో మాత్రమే పెళ్లిళ్లు చేసుకోవాలని ఆంక్షలు విధించింది.

ఈ తరుణంలోనే కొన్ని వివాహాలు కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో మాత్రమే జరిగాయి. అయితే డిసెంబర్ నెలలో మంచి ముహూర్తాలు ఉండడంతో రెండు తెలుగు రాష్ట్రాలలో వేలాదిమంది పెళ్లిళ్లు ఎంతో ఘనంగా ఇంతకుముందు మాదిరిగానే జరిగాయి. అయితే 2021లో పెళ్లిళ్లు చేసుకోవాలని భావించేవారు మరి కొద్ది నెలల పాటు ఆగాల్సిందేనని పురోహితులు చెబుతున్నారు. ప్రస్తుతం జనవరి 7 వరకే మంచి ముహూర్తాలు ఉన్నాయి. తరువాత వచ్చే మాఘమాసం లో పెళ్లిళ్లకు ప్రత్యేకమైనప్పటికీ ఈ ఏడాది మూడం రావడం వల్ల 2021 మే16 వరకు మంచి ముహూర్తాలు లేవని పురోహితులు తెలియజేస్తున్నారు.

అయితే కొత్త సంవత్సరంలో పెళ్లి చేసుకోవాలని భావించేవారు మే 16 వరకు వేచి ఉండాల్సిందేనని చెబుతున్నారు.ఈ సంవత్సరమంతా కరోనా కారణం వల్ల వాయిదా పడిన పెళ్ళిళ్ళు వచ్చే ఏడాదిలో సరైన ముహూర్తాలు లేకపోవడం వల్ల వాయిదా పడుతోంది. అయితే వచ్చే ఏడాది మరో ఐదు నెలల పాటు ఎలాంటి ముహూర్తాలు లేకపోవడం వల్ల ఈ వివాహాల పై ఆధారపడి జీవించే పురోహితులు, వంట మనుషులు, లైటింగ్స్, డెకరేషన్, డిజె సౌండ్ సెట్టింగ్స్, కళ్యాణ మంటపం వంటి వారు మరో ఐదు నెలల పాటు వారు జీవనాధారాన్ని కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పవచ్చు.




Next Story