మనం ఎత్తు తగ్గిపోతూ ఉన్నామట..!

Height of average Indian is declining, says study. భారతీయులు ఎత్తు తగ్గిపోతున్నమట..! నమ్మలేకపోతున్నారా ఇది నిజం. ముందుకంటే

By Medi Samrat
Published on : 28 Sept 2021 9:29 PM IST

మనం ఎత్తు తగ్గిపోతూ ఉన్నామట..!

భారతీయులు ఎత్తు తగ్గిపోతున్నమట..! నమ్మలేకపోతున్నారా ఇది నిజం. ముందుకంటే మనం చాలా తగ్గిపోతూ ఉన్నామని చెబుతున్నారు. భారతీయుల సరాసరి ఎత్తు క్రమంగా తగ్గుతోందని తాజా అధ్యయనం తెలిపింది. 1998 నుంచి 2015 వరకు భారతీయ వయోజనుల ఎత్తుపై నిర్వహించిన సర్వేలో కీలక విషయాలు తెలిశాయి. 1998-99లో ఎత్తు కొంచెం పెరిగిందని... అయితే 2005-06 నుంచి 2015-16 మధ్య కాలంలో ఎత్తు తగ్గిందని ఈ సర్వే వెల్లడించింది. పేద మహిళలు, గిరిజన మహిళల్లో ఈ క్షీణత ఎక్కువగా ఉందని సర్వే తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా సరాసరి ఎత్తు పెరుగుతుండగా.. భారతీయుల ఎత్తు మాత్రం తగ్గుతోందని తాజా అధ్యయనం తెలిపింది.

భారతీయ జనాభాలో వివిధ సమూహాల మధ్య ఎత్తు అంతరాయంపై కూడా అధ్యయనం జరగాలని.. జన్యుపరమైన అంశాలే కాకుండా... వాటికి సంబంధం లేని కారకాలు కూడా ఎత్తుపై ప్రభావం చూపుతున్నాయని తెలిపింది. జీవన విధానం, పౌష్టికాహారం, సామాజిక, ఆర్థిక తదితర అంశాలు కూడా ఉన్నాయని చెప్పింది. 15 నుంచి 25 ఏజ్ గ్రూపులో ఉన్న వారిలో ఎత్తు తగ్గుతోందని తెలిపింది. ఈ ఏజ్ గ్రూపులోని మహిళల సరాసరి ఎత్తు 0.42 సెంటీమీటర్లు, పురుషుల్లో 1.10 సెంటీమీటర్ల మేర సరాసరి ఎత్తు తగ్గిందని సర్వే వెల్లడించింది. ఇది చాలా ఆందోళన కలిగించే అంశమని దీనిపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని సూచించింది.


Next Story