కొడుకు మీద కోపం.. స‌గం ఆస్తిని కుక్కకు రాసిచ్చాడు

Half Property For the Dog. కొంద‌రు పెంపుడు జంతువుల‌ను త‌మ ఇంట్లోని కుటుంబ స‌భ్యులుగా చూసుకుంటుంటారు.

By Medi Samrat  Published on  31 Dec 2020 5:51 AM GMT
కొడుకు మీద కోపం.. స‌గం ఆస్తిని కుక్కకు రాసిచ్చాడు

కొంద‌రు పెంపుడు జంతువుల‌ను త‌మ ఇంట్లోని కుటుంబ స‌భ్యులుగా చూసుకుంటుంటారు. తాము చ‌నిపోయినా కూడా వాటికి ఏ క‌ష్టం రాకుండా ఉండేందుకు వాటి పేరు మీద త‌మ ఆస్తిలో కొంత భాగాన్ని రాసి ఇవ్వ‌డం చూస్తూనే ఉంటాం. తాజాగా ఓ వ్య‌క్తి త‌న కుమారుడి ప్ర‌వ‌ర్త‌న న‌చ్చ‌క త‌న ఆస్తిలో స‌గ భాగాన్ని త‌న పెంపుడు కుక్క పేరు మీద రాశాడు. మిగ‌తా స‌గ‌భాగాన్ని త‌న రెండో భార్య పేరు మీద రాశాడు. త‌న కుమారుడికి త‌న ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వ‌లేదు. ఈ ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని చింద్వాడా జిల్లాలో జ‌రిగింది.





బ‌రిబాడ గ్రామానికి చెందిన ఓం నారాయ‌ణ అనే వ్య‌క్తికి త‌న పెంపుడు కుక్క‌(జాకీ) అంటే చాలా ఇష్టం. కుమారుడి ప్రవర్తనతో విసిగిపోయిన ఆయన ఆస్తిలో సగభాగం పెంపుడు శునకానికి, మిగతా సగం తన రెండో భార్య చంపా బాయ్‌కి రాసిచ్చాడు.'నా భార్య చంపా బాయ్, జాకీ(కుక్క‌) ఇద్ద‌రూ న‌న్ను ఎంతో బాగా చూసుకుంటారు. అందుకే నా ఆస్తి మొత్తాన్ని వీరిద్దరి పేరున రాస్తున్నాను. నా మరణానంతరం నా ఆస్తి అంతా వీరికే చెందుతుంది. నేను చనిపోయిన తర్వాత అంత్యక్రియలు కూడా వీరే నిర్వహించాలి. అంతేకాదు జాకీని ఎవరైతే చూసుకుంటారో దాని పేరున ఉన్న ఆస్తికి వారే వారసులు అవుతారు' అని నారాయణ వర్మ తన వీలునామాలో రాశాడు.


Next Story