కొత్తరకం కరోనా 'స్ట్రెయిన్' లక్షణాలు ఇవే..

Corona Strain Symptoms. ఓ వైపు కరోనా వైర‌స్ కార‌ణంగా అల్లాడిపోతుంటే.. ఇప్పుడు కొత్త రకం స్ట్రెయిన్ వైరస్ జనాలకు

By Medi Samrat  Published on  25 Dec 2020 7:07 AM GMT
కొత్తరకం కరోనా స్ట్రెయిన్ లక్షణాలు ఇవే..

ఓ వైపు కరోనా వైర‌స్ కార‌ణంగా అల్లాడిపోతుంటే.. ఇప్పుడు కొత్త రకం స్ట్రెయిన్ వైరస్ జనాలకు ముచ్చెమటలు పట్టిస్తోంది. ఈ వైర‌స్ 70 శాతం వేగంగా వ్యాప్తి చెందుతుంద‌ని శాస్త్ర‌వేత్త‌లు చెబుతుండ‌డంతో ప్ర‌భుత్వాలు అప్ర‌మ‌త్తం అయ్యాయి. బ్రిట‌న్ నుంచి వ‌చ్చే విమానాల‌పై భార‌త్‌తో స‌హా చాలా దేశాలు తాత్కాలికంగా నిషేదం విధించాయి. అలాగే యూరోప్, యూకే, మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి భారత్‌కు వచ్చేవారు తప్పనిసరిగా RT-PCR పరీక్షలు చేయించుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది.

కరోనా లక్షణాలు ఎలా ఉంటాయో అందరికి తెలిసిందే. ఇక రూపంత‌రం చెందిన‌ కొత్త కరోనా వైరస్ లక్షణాలు ఏంటి.. ఎలా ఉంటాయి ఇప్పుడు తెలుసుకుందాం. అలసట, ఆకలి మందగించడం, తలనొప్పి, విరోచనాలు, మానసిక గందరగోళం, కండరాల నొప్పులు వంటివి కొత్త కరోనా లక్షణాల్లో ఉన్నాయని నిపుణులు పేర్కొన్నారు. కరోనా నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న ప్రపంచానికి కొత్త కరోనా వైరస్ మరిన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశం ఉన్నది. వ్యాక్సిన్ వస్తే కరోనా ముప్పు నుంచి బయటపడొచ్చని ప్రపంచం భావిస్తున్న నేపథ్యంలో కొత్త వైరస్ వచ్చి ఆ ఆశలపై నీళ్లు చల్లింది. బ్రిటన్, దక్షిణాఫ్రికా, నైజీరియాలో కొత్త వేరియంట్స్ ను కనుగొన్నారు.


Next Story