పోస్టాఫీసుల్లో నగదు ఉపసంహరణ, డిపాజిట్లపై చార్జీల వడ్డన

Charges For Post Office Cash Deposit. ఇక బ్యాంకుల మాదిరిగానే,పోస్టాఫీసుల్లో నగదు ఉపసంహరణ, డిపాజిట్లపై చార్జీల వడ్డన

By Medi Samrat  Published on  4 March 2021 4:17 AM GMT
Charges For Post Office Cash Deposit

ఇక బ్యాంకుల మాదిరిగానే పోస్టల్‌ శాఖలో మార్పులు జరుగుతున్నాయి. పోస్టాఫీసుల్లో నగదు జమ చేయడం, లేదా నగదు ఉపసంహరించుకోవడంపై ఇప్పుడు చార్జీలు విధించనున్నారు. ఏటీఎంలలో పరిమితికి మించి నగదు విత్‌డ్రా చేస్తూ చార్జీలు విధించినట్లుగానే ఇప్పుడు పోస్టల్‌ శాఖలో విధించనున్నారు. ఈ కొత్త చార్జీలు ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వస్తాయని పోస్టల్‌ శాఖ తెలిపింది. అయితే పోస్టాఫీసుల్లో ఖాతాను బట్టి ఈ చార్జీలను వసూలు చేస్తారని తెలుస్తోంది. నెలకు నాలుగు సార్లు నగదు ఉపసంహరణ చేసుకుంటే ఎటువంటి చార్జీలు వసూలు చేయరు. నాలుగు కంటే ఎక్కువ నగదు ఉపసంహరించుకుంటే ప్రతి లావాదేవీకి రూ.25 చొప్పున చార్జీలు వడ్డించనున్నారు. అలాగే పోస్టాఫీసుల్లో నగదు జమ చేయాల్సిన సమయంలో ఎటువంటి చార్జీలు చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఇక ప్రాథమిక పొదుపు ఖాతా కాకుండా కరెంటు ఖాతా ఉంటే ప్రతి నెలా రూ.25 వేల చొప్పున ఉపసంహరణ చేసుకోవచ్చు.

అప్పటి వరకు ఎలాంటి చార్జీలు వసూలు చేయరు. అంతేకాకుండా మీరు నెలలో పది వేల చొప్పున నగదు డిపాజిట్‌ చేసినట్లయితే ఎటువంటి రుసుము ఉండదు. ఆ మొత్తానికంటే ఎక్కువగా డిపాజిట్‌ చేసినట్లయితే కనీసం రూ.25 వసూలు చేస్తారు. అలాగే పోస్టు పేమెంట్‌ నెట్‌వర్క్‌లో అపరిమిత లావాదేవీలు పూర్తిగా ఉచితం. ఇక ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్‌పై కూడా ఛార్జీ చెల్లించాలి. ఐపీపీబీయేతర నెట్‌ వర్క్‌లలో నెలకు మూడు లావాదేవీలు ఉచితం. అలాగే ఇవే కాకుండా పోస్టాఫీసులలో మినీ స్టేట్‌ మెంట్‌ తీసుకోవడానికి ఐదు రూపాయల చార్జీ వసూలు చేస్తారు.




Next Story