అక్టోబర్ నెలలో బ్యాంకులకు అన్ని రోజులు సెలవులా..?

Banks to Remain Shut for 21 Days Next Month. అక్టోబర్ నెలలో పెద్ద ఎత్తున సెలవులు ఉండనున్నాయి. సాధారణంగా ముఖ్యమైన పండుగలు

By Medi Samrat  Published on  26 Sep 2021 10:40 AM GMT
అక్టోబర్ నెలలో బ్యాంకులకు అన్ని రోజులు సెలవులా..?

అక్టోబర్ నెలలో పెద్ద ఎత్తున సెలవులు ఉండనున్నాయి. సాధారణంగా ముఖ్యమైన పండుగలు ఉన్న నెలల్లో ఒక 5-10 సెలవులను చూస్తూ ఉంటాం..! కానీ అక్టోబర్ నెలలో ఏకంగా 21 రోజులు సెలవులు ఉన్నాయట. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా సెలవులపై ప్రకటన చేసింది. అయితే కొన్ని రాష్ట్రాలను బట్టి ఈ సెలవుల్లో తేడాలు ఉండనున్నాయి. రిజర్వ్ బ్యాంకు నిబంధనల ప్రకారం అక్టోబరు నెలలో 14 రోజులపాటు సెలవులున్నాయి. దీంతో పాటు ఆదివారాలు, రెండో, నాలుగో శనివారాలు కూడా ఉన్నాయి.

అక్టోబరు 1వతేదీన బ్యాంకుల క్లోజింగ్ ఆఫ్ అకౌంట్స్ కాబట్టి గ్యాంగ్ టక్ లో మొదటి సెలవు. అక్టోబరు 2వతేదీన గాంధీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు. అక్టోబరు 15వతేదీన దుర్గా పూజ సందర్భంగా సెలవు దినం. అక్టోబర్ 2, అక్టోబర్ 15 తేదీలలో దేశంలో ఎక్కడా కూడా బ్యాంకులు పనిచేయవు. అక్టోబరు 3వతేదీన ఆదివారం సెలవు. మహాలయ అమావాస్య సందర్భంగా అగర్తలా, బెంగళూరు, కోల్ కతాలలో అక్టోబరు 6 వతేదీన బ్యాంకులను మూసివేయనున్నారు. అక్టోబరు 7వతేదీన ఇంఫాల్ లో బ్యాంకులు పనిచేయవు.

అక్టోబరు 9వతేదీ రెండో శనివారం సందర్భంగా సెలవు. అక్టోబరు 10 ఆదివారం సెలవు. అక్టోబరు 12 వతేదీ అగర్తలా, కోల్‌కతాలలో బ్యాంకులకు సెలవు ప్రకటించారు. అక్టోబరు 13వతేదీన దుర్గాపూజ మహాఅష్టమి సందర్భంగా అగర్తలా, భువనేశ్వర్, గ్యాంగ్ టక్, గౌహతి, ఇంఫాల్, కోల్ కతా, పాట్నా, రాంచీలలో బ్యాంకులు పనిచేయవు. కోల్ కతా నగరంలో దుర్గా పూజ గురించి దేశం మొత్తం మాట్లాడుకుంటుంది. అక్టోబరు 14వతేదీన దుర్గాపూజ మహానవమి సందర్భంగా అగర్తలా, బెంగళూరు, చెన్నై, గ్యాంగ్ టక్, గౌహతి, కాన్పూర్, కొచ్చి, కోల్ కతా, లక్నో, పాట్నా, రాంచీ, షిల్లాంగ్, శ్రీనగర్, తిరువనంతపురంలలో బ్యాంకులకు సెలవు ప్రకటించారు.

అక్టోబరు 15న దసరా సందర్భంగా సిమ్లా,ఇంఫాల్ మినహా అన్ని ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు. అక్టోబరు 16న గ్యాంగ్ టక్ లో పూజ సందర్భంగా సెలవు. అక్టోబరు 17వతేదీ ఆదివారం. అక్టోబరు 18న గౌహతిలో బ్యాంకులకు సెలవు. అక్టోబరు 19న మిలాదున్నబి సందర్భంగా అహ్మదాబాద్, బేలాపూర్, భోపాల్, చెన్నై, డెహ్రాడూన్, హైదరాబాద్, ఇంఫాల్, జమ్మూ, కాన్పూర్, కొచ్చి , లక్నో, ముంబై, నాగపూర్, న్యూఢిల్లీ, రాయపూర్, రాంచీ, శ్రీనగర్, తిరువనంతపురంలలో బ్యాంకులు పనిచేయవు. అక్టోబర్ 20వతేదీన మహర్షి వాల్మీకి పుట్టినరోజు,లక్ష్మీ పూజల సందర్భంగా అగర్తలా, బెంగళూరు, చండీగఢ్, కోల్‌కతా, సిమ్లాలలో బ్యాంకులు మూసివేయనున్నారు.శ్రీనగర్ లో అక్టోబరు 22న మిలాదున్నబి తర్వాత శుక్రవారం సెలవు ఇచ్చారు. అక్టోబరు 23వతేదీన నాల్గవ శనివారం, అక్టోబరు 24 న ఆదివారం సందర్భంగా బ్యాంకులకు సెలవు అని చెప్పారు.

దీన్ని దృష్టిలో ఉంచుకుని బ్యాంకు పనులు ఏవైనా ఉంటే.. ఈ లిస్టుకు తగ్గట్టుగా ప్లాన్ చేసుకోవడం మంచిది. అక్టోబర్ నెలను పండుగ సీజన్‌గా పరిగణించబడుతోంది, ముందు చెప్పినట్లుగా, అవి లొకేషన్-బేస్డ్ సెలవులు అని గుర్తుంచుకోండి. రెండు పెద్ద సెలవులు మినహా, మిగిలినవి స్వల్ప స్వభావంతో ఉంటాయి. బ్యాంకుల సెలవులను దృష్టిలో ఉంచుకొని ఖాతాదారులు అసౌకర్యాన్ని నివారించడానికి ప్రణాళిక రూపొందించుకోవాలని రిజర్వు బ్యాంకు సూచించింది.


Next Story