పీవీసీ ఆధార్.. పొందాలంటే ఇలా చేయండి
Aadhaar PVC Card: Here's How to Order it. దీనికి ఆధార్‌లో తమ ఫోన్ నెంబర్ రిజిస్టర్ లేని వారు సైతం దీనిని తీసుకోవచ్చు
By Medi Samrat Published on 16 Nov 2020 10:29 AM GMTఆధార్ ప్రాధికార సంస్థ యూఐడీఏఐ( యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా) గత నెలలో పీవీసీ(పాలి వినైల్ కార్డు) రూపంలో ఆధార్ కార్డులను అందుబాటులోకి తెచ్చింది. ఇవి చూడడానికి అచ్చం మనం ఉపయోగించే పాన్ కార్డు, డెబిట్, క్రెడిట్ కార్డు సైజులో ఉంటుంది. దీంతో దీన్ని ఎంచక్కా వాలెట్‌లో పెట్టుకోవచ్చు. ఈ పీవీసీ కార్డులో యూఐడీఏఐ బోల్డన్ని సెక్యూరిటీ ఫీచర్లు జోడించింది. దేశంలో దీన్ని ఎవరైనా పొందవచ్చు. కేవలం రూ.50 నామమాత్రపు ఫీజు చెల్లించి వీటిని పొందవచ్చు.
దీనికి ఆధార్‌లో తమ ఫోన్ నెంబర్ రిజిస్టర్ లేని వారు సైతం దీనిని తీసుకోవచ్చు. నాన్-రిజిస్టర్డ్, లేదంటే ప్రత్యామ్నాయ ఫోన్ నంబరు ఆప్షన్‌పై క్లిక్ చేసి పీవీసీ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అంతేకాదు, తన మొబైల్ నంబరు ఉపయోగించి ఇంటి సభ్యులందరి కోసం ఒక్కరే దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కూడా కల్పించింది.
పీవీసీ ఆధార్ కార్డు పొందడం కోసం ఇలా చేయండి..
-ఆధార్ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లిన తరువాత మై ఆధార్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. అక్కడ మీకు ఆర్డర్ ఆధార్ అనే పీవీపీ కార్డు అనే లింక్ కనిపిస్తుంది. లేదంటే.. డైరెక్టుగా https://residentpvc.uidai.gov.in/order-pvcreprint లోకి వెళ్లాలి
-ఆధార్ నంబరు/వర్చువల్ ఐడెంటిఫికేషన్ నంబర్, లేదంటే ఆధార్ కార్డుపై ఉన్న ఈఐడీ నంబరు ఎంటర్ చేయాలి
-ఆ తర్వాత 'సెండ్ ఓటీపీ' అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. మొబైల్ నంబరు రిజిస్టర్ చేసుకోకుంటే ప్రత్యామ్నాయ మొబైల్ నంబరు ఇవ్వొచ్చు.
-మొబైల్ నంబరు రిజిస్టర్ అయి ఉంటే మాత్రం ఆధార్ ప్రివ్యూ కనిపిస్తుంది. లేని వారికి కార్డు ప్రివ్యూ కనిపించదు.
మొబైల్ ఆధార్ అప్లికేషన్ కోసం టైమ్ బేస్‌డ్ టైమ్ పాస్‌వర్డ్ (టీఓటీపీ)ని కూడా ఉపయోగించుకోవచ్చు.
-ఓటీపీని ఎంటర్ చేశాక, పీవీసీ కార్డు కోసం అవసరమైన రుసుము చెల్లిస్తే పీవీసీ కార్డు కోసం దరఖాస్తు పూర్తయినట్టే. కొన్ని రోజుల్లోనే స్పీడ్ పోస్టులో ఆధార్ మీ ఇంటికి చేరుతుంది. దీనికి ట్రాకింగ్ ఆప్షన్ కూడా ఉంది. 'మై ఆధార్' అని క్లిక్ చేసి, 'చెక్ ఆధార్ పీవీసీ కార్డ్ స్టేటస్' అని ఎంచుకుంటే మీ ఆధార్ మీ చేతుల్లోకి వచ్చేందుకు ఎంత సమయం పడుతుందో తెలుసుకోవచ్చు.