ఈ 7 బ్యాంకుల్లో మీకు ఖాతా ఉందా..? అయితే వెంటనే ఈ పనులు చేసుకోండి.. లేకపోతే ఇబ్బందులు తప్పవు

7 Bank Holders must do immediately these things. బ్యాంకు కస్టమర్లకు అలర్ట్‌.. పలు బ్యాంకులకు చెందిన చెక్‌ బుక్‌లు, పాస్‌బుక్‌లు

By Medi Samrat  Published on  13 March 2021 8:56 AM IST
ఈ 7 బ్యాంకుల్లో మీకు ఖాతా ఉందా..? అయితే వెంటనే ఈ పనులు చేసుకోండి.. లేకపోతే ఇబ్బందులు తప్పవు

బ్యాంకు కస్టమర్లకు అలర్ట్‌.. పలు బ్యాంకులకు చెందిన చెక్‌ బుక్‌లు, పాస్‌బుక్‌లు ఇక నుంచి పని చేయవు. ఏప్రిల్‌ 1 నుంచి రూల్స్‌ మారనున్నాయి. అందుకు కారణం కొన్ని బ్యాంకుల విలీనమే. వీటి ప్రక్రియ మార్చి 31తో ముగిసిపోతుంది.

ఏఏ బ్యాంకులంటే..

1. ఆంధ్రాబ్యాంకు, 2. ఓరియెంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌, 3. దేనా బ్యాంకు, 4. విజయ బ్యాంకు, 5.కార్పొరేషన్ బ్యాంకు, 6. యునైటెడ్‌ బ్యాంక్‌, 7. అలహాబాద్‌ బ్యాంక్‌. అయితే ఈ బ్యాంకులున్న కస్టమర్లు ఏప్రిల్‌ నుంచి మారనున్నారు. అందుకే వారి వద్ద ఉన్న పాస్‌బుక్‌, చెక్‌ బుక్‌లు పని చేయవు.

మరి కస్టమర్ల ఏం చేయాలి..

విలీనమైపోయిన బ్యాంకుల్లో మీ ఖాతాలు ఉంటే వెంటనే వివరాలు అప్‌డేట్స్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఆయా బ్యాంకుల వెళ్లి మొబైల్‌ నెంబర్‌, అడ్రస్‌, నామినీ పేరు తదితర వివరాలు ఈ నెల 31లోగా బ్యాంకులకు వెళ్లి పూర్తి వివరాలు అప్‌డేట్స్‌ చేసుకోవాలి. లేకపోతే భవిష్యత్తులో సమస్యలు తలెత్త అవకాశం ఉంది.

కొత్త చెక్‌బుక్‌, పాస్‌బుక్స్‌ తీసుకున్న తర్వాత మీరు మీ వివరాలను ఇతర ఫైనాన్షియల్‌ ఇన్‌స్ట్‌మెంట్లలో కూడా అప్‌డేట్స్‌ చేసుకోవడం తప్పనిసరి. మ్యూచువల్ ఫండ్స్, ట్రేడింగ్ అకౌంట్, లైఫ్ ఇన్సూరెన్స్, ఇన్‌కమ్ ట్యాక్స్ అకౌంట్, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు, పీఎఫ్ తదితర వాటిల్లో బ్యాంక్ అకౌంట్ వివరాలు అప్‌డేట్ చేసుకోవచ్చు.




Next Story