చైర్‌పర్సన్లుగా మహిళామణులు

By అంజి  Published on  28 Jan 2020 4:47 AM GMT
చైర్‌పర్సన్లుగా మహిళామణులు

తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ అఖండ విజయాన్ని సాధించింది. తొమ్మిది కార్పొరేషన్‌లు‌, 110 మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్‌ తన జెండాను ఎగరవేసింది. సోమవారం చైర్మన్‌ ఎన్నిక ప్రక్రియ ఉత్కంఠ సాగింది. ఎక్స్‌ అఫిషియో సభ్యులు, ఆకర్ష్‌ వ్యూహాలతో ప్రతిపక్షాలు చతికిల పడ్డాయి. రాజకీయాల్లోనూ, పట్టణాల అభివృద్ధిలోనూ మేం ఏం తక్కువ కాదంటున్నారు కొందరు మహిళలు. తాజాగా కొన్ని మున్సిపాలిటీల్లో మహిళలు చైర్‌పర్సన్‌లుగా ఎన్నిక కావడం విశేషం.

కామారెడ్డి మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌గా టీఆర్‌ఎస్‌ నుంచి గెలిచిన జాహ్నవి ఎన్నికయ్యారు. మొదటి సారి కౌన్సిలర్‌గా పోటీ చేసిన ఆమె జాక్‌పాట్‌ కొట్టేసింది. ఎల్‌ఎల్‌బీ మొదటి సంవత్సరం చదువుతున్న జాహ్నవి సివిల్స్‌ ప్రజలకు సేవ చేయాలని నిర్ణయించుకుంది. కానీ చివరకు రాజకీయాలకు వైపు వచ్చింది. తండ్రి వేణుగోపాల్‌రావు ప్రోత్సహంతో 33వ వార్డు నుంచి జాహ్నవి గెలిచింది. ఆమె తండ్రికి ఉన్న అంగబలంతో పాటు, జాహ్నవి మంచి విద్యావంతురాలు కావడంతో ఆమెను చైర్‌ పర్సన్‌ పదవి వరించింది.

వరంగల్‌ రూరల్‌ జిల్లా వర్ధన్నపేట మున్సిపల్‌ చైర్‌పర్స్‌గా 23 ఏళ్ల అరుణ ఎన్నికయ్యారు. మున్సిపాలిటీ పరిధిలోని డీసీ తండాకు చెందిన అరుణ 6వ వార్డును టీఆర్‌ఎస్‌ తరఫున గెలుపొందారు. ఆమెకు పెళ్లైనా.. ఆస్తకి కొద్ది ఇంకా చదువుతునే ఉన్నారు. సోమవారం ఆమె మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌గా ప్రమాణం చేశారు. 23 ఏళ్లకే చైర్‌పర్సన్‌గా ఎన్నికైన అరుణ అతిపిన్న వయస్కురాలిగా రికార్డు సాధించారు. ప్రస్తుతం ఆమె రంగశాయిపేటలోన ఓ కాలేజీలో బీఎస్పీ సెంకడ్‌ ఇయర్‌ చదువుతున్నారు.

మధిర మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా మొండితోక లత ఎన్నికయ్యారు. మధిర మున్సిపల్‌ చైర్మన్‌ పదవి ఎస్సీ మహిళకు రిజర్వు కావడంతో ఆమె తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. అంతకుముందు ఆమె ఓ ప్రభుత్వ హాస్టల్‌ వార్డెన్‌ పని చేశారు. అన్ని కలిసి రావడంతో టీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేసిన ఆమె మధిర మున్సిపల్‌ చైర్మన్‌గా ఎన్నికయ్యారు.

నాగర్‌ కర్నూలు జిల్లా మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌గా కల్పన ఎన్నికయ్యారు. ఎన్నికల ముందు ఆమె రోడ్డు ప్రమాదానికి గురికావడంతో ప్రచారం చేయలేకపోయారు. 17వ వార్డు కౌన్సిలర్‌గా పోటీ చేసిన ఆమెకు మద్దుతుగా ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి ప్రచారం చేసి గెలిపించారు. సోమవారం రోజున మున్సిపాల్‌ కార్యాలయానికి ఆమె వీల్‌చైర్‌లో వచ్చి ప్రమాణం చేశారు.

సూర్యాపేట మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా పెరుమాండ్ల అన్నపూర్ణ ఎన్నికయ్యారు. తొమ్మిదో వార్డు నుంచి అన్నపూర్ణ గెలుపొందారు. జనరల్‌ మహిళ స్థానంలో దళిత మహిళకు పట్టం కట్టడంపై సర్వత్రా అభినందనలు వ్యక్తమయ్యాయి. చివరి నిమిషం వరకు మంత్రి జగదీష్‌రెడ్డి గోప్యత పాటించారు. కౌన్సిల్‌ హాల్‌లో మంత్రి జగదీష్‌ రెడ్డి అన్నపూర్ణ పేరును ప్రకటించారు. చైర్‌పర్సన్‌ పదవి దక్కడంతో ఆమె ఒకింతా భావాద్వేగానికి లోనయ్యారు.

Next Story