తెలంగాణలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లు వీరే..

By సుభాష్  Published on  27 Jan 2020 1:31 PM GMT
తెలంగాణలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లు వీరే..

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో టీఆర్‌ఎస్‌ దుమ్మురేపిన విషయం తెలిసిందే. ఇక మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పేర్లు ఖరారయ్యాయి. రాష్ట్రంలో మొత్తం 120 మున్సిపాలిటీలకు గాను 112 స్థానాలను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. 8 మున్సిపాలిటీలు మాత్రమే కాంగ్రెస్‌ దక్కించుకోగా, మున్సిపల్‌ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో అధికార తెలంగాణ రాష్ట్రీయ సమితి(టీఆర్‌ఎస్‌) దుమ్మురేపింది. 120 మున్సిపాటీలకు గానూ 112 దక్కించుకుని సత్తా చాటింది. ఇక మిగిలిన 8 మున్సిపాలిటీలలో కాంగ్రెస్‌ 4, బీజేపీ 2, ఎంఐఎం 2 దక్కించుకున్నాయి.

ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని 15 మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్ధులు చైర్మన్‌ పదవులను దక్కించుకున్నారు. బొల్లారంలో తప్ప అన్నిచోట్ల వైస్‌ చైర్మన్‌ పదవులను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. బొల్లారంలో కాంగ్రెస్‌ అభ్యర్థి అంతిరెడ్డిగారి అనిల్‌రెడ్డి వైస్‌ చైర్మన్‌గా ఎన్నికయ్యారు.

ఉమ్మడి మెదక్‌ జిల్లా:

► సంగారెడ్డి మున్సిపల్‌ చైర్మన్‌గా విజయలక్ష్మీ, వైస్‌ చైర్మన్‌గా లతారెడ్డి.

► ఆందోల్‌ - జోగిపేట మున్సిపల్‌ చైర్మన్‌గా గూడెం మల్లయ్య, వైస్‌ చైర్మన్‌గా ప్రవీణ్‌కుమార్‌

► సదాశివపేట మున్సిపల్‌ చైర్మన్‌గా పిల్లోడి విజయమ్మ, వైస్‌ చైర్మన్‌గా చింతా గోపాల్‌.

► నారాయణఖేడ్ మున్సిపల్ చైర్మన్‌గా రూబీనా బేగం, వైస్ చైర్మన్గా అయ్యర్ పరశురాం.

► అమీన్‌ పూర్‌ మున్సిపల్ చైర్మన్‌గా తుమ్మల పాండురంగారెడ్డి, వైస్ చైర్మన్గా నందారం నర్సింహగౌడ్

► బొల్లారం మున్సిపల్ చైర్మన్ గా రోజారాణి, వైస్ చైర్మన్‌గా అనిల్ రెడ్డి

► తెల్లాపూర్‌ మున్సిపల్‌ చైర్మన్‌గా మల్లేపల్లి లలిత, వైస్‌ చైర్మన్‌గా బలగౌని రాములు.

మెదక్‌ జిల్లా

► మెదక్‌ మున్సిపల్‌ చైర్మన్‌గా తొడుపునూరి చంద్రపాల్, వైస్ చైర్మన్‌గా ఆరెల్ల మల్లికార్జున్ గౌడ్ ఎన్నిక.

► తూప్రాన్‌ చైర్మన్‌గా బొంది రవిందర్‌ గౌడ్‌, వైస్‌ చైర్మన్‌గా నందాల శ్రీనివాస్‌

► రామాయంపేట చైర్మన్‌గా పల్లె జితేంద్ర గౌడ్‌, వైస్‌ చైర్మన్‌గా పుట్టి విజయలక్ష్మీ.

► చేర్యాల చైర్మన్‌గా అంకుగారి స్వరూప రాణి, వైస్‌ చైర్మన్‌గా రాజీవ్‌కుమార్‌రెడ్డి

సిద్దిపేట జిల్లా

► దుబ్బాక చైర్మన్‌గా గన్నె వనిత, వైస్‌ చైర్మన్‌ సుగుణ బాలకిషన్‌ గౌడ్‌

► హుస్నాబాద్‌ చైర్మన్‌గా ఆకుల రజిత, వైస్‌ చైర్మన్‌ అనిత

► గజ్వేల్‌ ప్రజ్ఞాపూర్‌ చైర్మన్‌గా నేతిచిన్న రాజమౌళి, వైస్‌ చైర్మన్‌గా ఎండీ జకీరుద్దీన్‌

► నర్సాపూర్‌ చైర్మన్‌గా ఎర్రగొల్ల మురళీ యాదవ్‌, వైస్‌ చైర్మన్‌గా ఎండీ నయీముద్దీన్‌

వరంగల్‌ జిల్లా

► వర్ధన్నపేట మున్సిపల్ చైర్మపర్సన్‌గా అంగోత్‌ అరుణ, వైస్‌ చైర్మన్‌గా కొమండ్ల ఏలందర్‌ రెడ్డి

► పరకాల మున్సిపల్‌ చైర్మన్గా సోదా అనిత, వైస్‌ చైర్మన్‌గా రేగూరి జైపాల్‌ రెడ్డి,

► మహబూబాబాద్‌ మున్సిపల్‌ చైర్మన్‌గా డాక్టర్‌ పాల్వాయి రామ్మోహన్‌ రెడ్డి, వైస్‌ చైర్మన్‌గా మహ్మద్‌ ఫరిద్‌

►నర్సంపేట మున్సిపల్‌ చైర్మన్‌గా గుంటి రజని కిషన్‌, వైస్‌ చైర్మన్‌గా మునిగాల వెంకటరెడ్డి.

మహబూబాద్‌ జిల్లా:

► మరిపేడ మున్సిపల్‌ చైర్మన్‌గా గుగులోతు సింధూర, వైస్‌ చైర్మన్‌గా ముదిరెడ్డి బుచ్చిరెడ్డి

► డోర్నకల్‌ మున్సిపల్‌ చైర్మన్గా వంకుడొతు వీరన్న, వైస్‌ చైర్మన్‌గా కేసబోయి కోటి లింగం

► తొర్రూర్‌ మున్సిపల్‌ చైర్మన్‌గా మంగళపల్లి రామచంద్రయ్య, వైస్‌ చైర్మన్‌గా జినుగ

► భూపాలపల్లి జిల్లా మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌గా సెగం వెంకటరాణి, వైస్‌ చైర్మన్‌గా కొత్త

► జనగామ జిల్లా మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌గా పోకలు జమున, వైస్‌ చైర్మన్‌గా మేకల రాంప్రసాద్‌

ఇక ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో మొత్తం 17 మున్సిపాలిటీల్లో 16 మున్సిపాలిటీలు టీఆర్‌ఎస్‌ గెలుచుకుంది. కొల్లాపూర్‌,అయిజ, భూత్పూర్‌, కోస్గిలో మెజార్టీ లేకపోయినా చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవులను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకోవడం విశేషం. ముక్తల్‌ మున్సిపాలిటీలో కాంగ్రెస్‌ మద్దతుతో బీజేపీ దక్కించుకుంది. అమరచింత వైస్‌చైర్మన్‌గా సీపీఎం అభ్యర్థి గోపి ఎన్నికయ్యారు.

► మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ చైర్మన్‌గా కోరమోని నర్సింహులు, వైస్‌ చైర్మన్‌గా గణేష్‌

► భూత్పూర్‌ మున్సిపల్‌ చైర్మన్‌గా బస్వరాజ్‌ గౌడ్‌, వైస్‌ చైర్మన్‌గా కెంద్యాల శ్రీనివాస్‌

వనపర్తి జిల్లా

► అమరచింత మున్సిపల్‌చైర్మన్‌గా మంగమ్మ, వైస్‌ చైర్మన్‌గా గోపి

► ఆత్మకూర్‌ మున్సిపల్‌ చైర్మన్‌గా గాయత్రి, వైస్‌ చైర్మన్‌గా విజయభాస్కర్‌

► కొత్తకోట మున్సిపల్‌ చైర్మన్‌గా సుకేషిని, వైస్‌ చైర్మన్‌గా బీసం జయమ్మ

► వనపర్తి మున్సిపల్‌ చైర్మన్‌గా గాలి యాదవ్, వైస్ చైర్మన్‌గా వాకాటి శ్రీధర్‌

► పెబ్బేరు మున్సిపల్‌ చైర్మన్‌గా కరుణశ్రీ, వైస్‌ చైర్మన్‌గా మేకల కర్రెస్వామి

నాగర్ కర్నూల్ జిల్లా:

► కొల్లాపూర్‌ మున్సిపల్‌ చైర్మన్‌గా విజయలక్ష్మీ, వైస్‌ చైర్మన్‌గా మహదాబేగం

► నాగర్‌ కర్నూలు మున్సిపల్‌ చైర్మన్‌గా కల్పనా భాస్కర్‌ గౌడ్‌, వైస్‌ చైర్మన్‌గా భాస్కరరావు

జోగులాంబ గద్వాల జిల్లా

► గద్వాల మున్సిపల్‌ చైర్మన్‌గా కేశవ్‌, వైస్‌ చైర్మన్‌గా బాబర్‌

► వడ్డెపల్లి మున్సిపల్‌ చైర్మన్‌గా కరుణ, వైస్‌ చైర్మన్‌గా సుజాత

► అలంపూర్‌ మున్సిపల్‌ చైర్మన్‌గా మనోహరమ్మ, వైస్‌ చైర్మన్‌గా శేఖర్‌

► అయిజ మున్సిపల్‌ చైర్మన్‌గా దేవన్న, వైస్‌ చైర్మన్‌గా మాల నర్సింహులు

నారాయణపేట జిల్లా

► నారాయణపేట మున్సిల్‌ చైర్మన్‌గా అనసూయ, వైస్‌ చైర్మన్‌గా హరినారాయణ బట్టడ్‌

► కోస్గి మున్సిపల్‌ చైర్మన్‌గా శిరీష, వైస్‌ చైర్మన్‌గా అన్నపూర్ణ

► మక్తల్ మున్సిపల్‌ చైర్మన్‌గా పావని, వైస్ చైర్మన్‌గా అఖిలారెడ్డి

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో ఆరు మున్సిపాలిటీలను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. నిజామాబాద్‌ నగర పాలక సంస్థను ఎంఐఎం మద్దతుతో టీఆర్‌ఎస్‌ దక్కించుకుంది.

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా

► బోధన్‌ మున్సిపల్‌ చైర్మన్‌గా తూము పద్మ, వైస్‌ చైర్మన్‌గా ఏతేషామ్‌

► ఆర్మూర్‌ మున్సిపల్‌ చైర్మన్‌గా పండిత్‌ వినీత్‌, వైస్‌ చైర్మన్‌ మున్నాభాయ్‌

► కామారెడ్డి మున్సిపల్‌ చైర్మన్‌గా జాహ్నవి, వైస్‌ చైర్మన్‌గా ఇందుప్రియ

►బాన్సువాడ మున్సిపల్‌ చైర్మన్‌గా జంగం గంగాధర్‌, వైస్‌ చైర్మన్‌గా షేక్‌ జుబేర్‌

► భీంగల్‌ మున్సిపల్‌ చైర్మన్గా మల్లెల రాజశ్రీ, వైస్‌ చైర్మన్‌గా భగత్‌

► ఎల్లారెడ్డి మున్సిపల్‌ చైర్మన్‌గా సత్యనారాయణ, వైస్‌ చైర్మన్‌గా సుజాత

Next Story