ఇక నుండి ట్రాఫిక్ సిగ్నల్ పాయింట్ వద్ద హారన్ కొట్టండి.. దమ్ముంటే..
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 31 Jan 2020 1:06 PM GMTపెద్ద పెద్ద నగరాల్లో చౌరస్తాల వద్ద సిగ్నల్ పడటంతో వందల మీటర్ల దూరం వాహనాలు నిలిచిపోతాయి. అలా ట్రాఫిక్‌లో నిలిచిన వాహనదారులు హరన్ కొట్టడం గురించి అయితే ప్రత్యేకంగా చెప్కక్కర్లేదు. కొద్దిమంది తోటి వాహనదారులు వారిస్తున్నా వినరు. ఎకబిగిన హారన్ కొడుతూనే ఉంటారు. ఇలాంటి వారందరికి అడ్డుకట్ట వేయడానికి ముంబై పోలీసులు విరుగుడు కనుగ్గొన్నారు. ఇటువంటి వారికోసమే సిగ్నల్ వద్ద డెసిబుల్ మీటర్‌ను ఏర్పాటుచేశారు ముంబాయి ట్రాఫిక్ పోలీసులు. ఇకనుండి సిగ్నల్ పడ్డ సమయంలో పొరపాటున హరన్ కొట్టిన ఇక అంతే సంగతులు.
అవును.. మీరు తొందరలో హారన్ కొట్టినా.. మరచిపోయి హారన్ కొట్టినా.. సిగ్నల్ దగ్గర ఉన్న డెసిబుల్ మీటర్ (డీఎం)లో పాయింట్లు రికార్డవుతాయి. ఆ మీటర్ 85 దాటిందో అంతే సంగతులు. రెడ్ సిగ్నల్ ఆటోమొటిగ్‌గా వెలుగుతుంది. దీంతో వాహనదారులంతా మరో 90 సెకన్లు నిరీక్షించాల్సిందే. ముంబై పోలీసులు ఏర్పాటు చేసిన ఈ కొత్త విధానం ఇప్పుడు దేశవ్యాప్తంగా మన్ననలు పొందుతుంది.
ముంబయి మహానగరంలో రోడ్లపై రద్దీ చాలా ఎక్కువ. ఆ రద్దీ కారణంగా ట్రాఫిక్‌లో వాహనదారులు ఉరుకులు, పరుగుల మీద ఉంటారు. దీంతో ట్రాఫిక్ సిగ్నల్‌ల వద్ద పరిస్థితి వర్ణణాతీతం. దీంతో పోలీసులు ఆలోచనలో పడ్డారు. ఎలాగైనా ఈ సమస్యకు చెక్ పెట్టాలని ప్రయత్నించారు. ఓ ఉదయం మాంచి ఐడియా తట్టడంతో ప్రధాన కూడళ్లలో డెసీబుల్ మీటర్ ఏర్పాటు చేశారు.
అయితే.. మరునాడు వాహనదారులు మాత్రం ఎప్పటిలానే హరన్ కొడుతున్నారు. పోలీసుల ప్లాన్ ప్రకారం 85 డిగ్రీలు దాటడం.. మళ్లీ సిగ్నల్ పడటం జరుగుతుంది. దీంతో వాహనదారులకు ఏం అర్థం కాలేదు. పక్కనే ఉన్న స్క్రీన్‌పై మాత్రం honk more wait more అని రాసి ఉంది. దీంతో అంతా కామ్ అయిపోయారు. హరన్ వల్ల ఉపయోగం లేదు.. మరో 90 నిమిషాలు ఇక్కడే ఉండాలి అని అర్థం చేసుకున్నారు. వీడియో చివర్లో feel free to honk.. if you dont mind waiting అనే మెసేజ్ ఇచ్చారు.
ఇలా ముంబయి పోలీసులు చేసిన ప్రయోగాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 1.54 సెకన్లు గల ఈ వీడియోను.. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ చూసి ఆశ్చర్యపోయారు. ముంబై పోలీసుల ప్రయోగాన్ని మెచ్చుకుంటూ.. మనం హైదరాబాద్‌లో ఇలా ఎందుకు చేయకూడదని డీజీపీ, హైదరాబాద్ పోలీసు కమిషనర్, జీహెచ్ఎంసీ కమిషనర్‌కు మంత్రి కేటీఆర్ సూచించారు.