కరోనా కట్టడికి.. ఆటగాళ్లకు రింగ్స్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన ముంబై ఇండియన్స్
By తోట వంశీ కుమార్ Published on 6 Sep 2020 7:13 AM GMTసెప్టెంబర్ 19 నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 13వ సీజన్ ప్రారంభం కానుంది. కోరోనా జాగ్రత్తలు తీసుకుంటూ యూఏఈ వేదికగా ఈ మ్యాచ్‌లు నిర్వహించేందుకు బీసీసీఐ సిద్దమైంది. ఇప్పటికే అన్ని జట్లు యూఏఈ చేరుకుని క్వారంటైన్ పూర్తిచేసుకుని ప్రాక్టీస్ మొదలెట్టాయి. ఇక డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ అన్ని విధాలుగా సిద్దమవుతోంది.
ఇటీవల చెన్నై జట్టులో 13 మంది కరోనా సోకిన నేపథ్యంలో ముంబై తమ ఆటగాళ్ల భద్రత కోసం సరికొత్త ఆలోచన చేసింది. కరోనా కట్టడికి నేషనల్ బాస్కెట్ బాల్ అసోసియేషన్(ఎన్‌బీఏ) శైలిలో ఓ స్మార్ట్ రింగ్‌ను ప్రవేశపెట్టింది. ఇది వ్యక్తిగత హెల్త్ ట్రాకింగ్ డివైస్‌గా పనిచేస్తుంది. ప్రతి ఒక్కరూ దీన్ని పెట్టుకోవాలి. ఇప్పటికే బీసీసీఐ.. బ్లూటూత్‌తో కూడి కాంటాక్ట్ డివైస్‌ను అన్ని జట్లకు ఇచ్చింది. హెల్త్ యాప్ ద్వారా ఇందులో ప్రతి ఒక్కరు డైలీ ఫిట్‌నెస్ వివరాలను పొందుపర్చాలి. అయితే దీని అడ్వాన్స్ మోడల్‌గా ఇప్పుడు ముంబై ఇండియన్స్ తమ ఆటగాళ్లకు స్మార్ట్ రింగ్‌ను అందజేసింది.
వీటితో ఆటగాళ్ల గుండె వేగం, శ్వాసలో హెచ్చుతగ్గులు, శరీర ఉష్ణోగ్రతలకు సంబంధించిన సమాచారాన్ని ఈరింగ్ గుర్తిస్తుందట. అందులో వారికి ఏమైనా తేడాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్తలు తీసుకోవడానికి ఎంఐఈ ఏర్పాట్లు చేసింది. ఇక సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు షార్జా, దుబాయ్, అబుదాబి మూడు వేదికల్లో ఐపీఎల్ 2020 సీజన్ జరగనుంది. నేడు ఐపీఎల్ షెడ్యూల్‌ను కూడా బీసీసీఐ ప్రకటించనుంది. కాగా.. మరోసారి టైటిల్ అందుకోవాలని డిఫెండింగ్ చాంపియన్ ఉవ్విళ్లూరుతోంది.