క్రికెట్‌ ప్రేమికులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్)2020 పూర్తి షెడ్యూల్‌ను నేడు విడుదల చేయనున్నట్లు చైర్మన్‌ బ్రిజేష్‌ పటేల్‌ వెల్లడించారు. సెప్టెంబర్‌ 19 నుంచి ఐపీఎల్‌ ప్రారంభం అంటూ ఇప్పటికే ప్రకటినా.. ఇప్పటి వరకు టోర్నీ షెడ్యూల్‌ విడుదల చేయలేదు. దీంతో అభిమానుల్లో ఆందోళన ఉత్కంఠ నెలకొంది. మార్చిలో ప్రారంభం కావాల్సిన ఐపీఎల్‌ కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే.

‘ఆదివారం ఐపీఎల్‌ షెడ్యూల్‌ను విడుదల చేస్తాం’ అని ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ బ్రిజేశ్‌ పటేల్‌ శనివారం వెల్లడించారు. ఇక ఆరంభ మ్యాచ్‌పై అభిమానుల్లో ఆసక్తి నెలకొనింది. గతేడాది ఫైనల్‌కు చేరిన జట్లతోనే ఏటా టోర్నీ ఆరంభ మ్యాచ్‌ను నిర్వహిస్తారు. ఇప్పటి వరకు అది ఆనవాయితిగా వస్తోంది. గతేడాది పైనల్‌లో ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్లు ఫైనల్‌ మ్యాచ్‌ ఆడాయి. దీంతో ఈ సారి ఆరంభ మ్యాచ్‌లో ఈ ఇద్దరు తలపడాల్సి ఉంది.

అయితే.. ఇటీవల చెన్నై జట్టులో కరోనా కలకలం రేపింది. ఆ జట్టు ఇద్దరు ఆటగాళ్లతో పాటు సహాయ సిబ్బంది కలిపి మొత్తం 13 మందికి కరోనా పాజిటివ్‌గా రావడంతో.. ఆ జట్టు క్వారంటైన్‌ గడువును పెంచారు. అంతేకాకుండా రైనా, భజ్జీలాంటి స్టార్‌ ఆటగాళ్లు ఆ జట్టుకు దూరం అయ్యారు. ఎట్టకేలకు క్వారంటైన్‌ పూర్తి చేసుకున్న చెన్నై జట్టు ఆలస్యంగానైనా ప్రాక్టీస్‌ మొదలెట్టింది. శనివారం ఐపీఎల్‌ నిర్వాహకులు ట్విట్టర్‌లో ఓ ఆసక్తికర పోస్టర్‌ను విడుదల చేశారు. ‘డ్రీమ్‌ 11 ఐపీఎల్‌కు ఇంకా 14 రోజులే మిగిలి ఉన్నాయి. ఆగలేకపోతున్నాం.’ అని పేర్కొంటూ.. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌ కెప్టెన్లు విరాట్‌ కోహ్లీ, దినేశ్‌ కార్తిక్‌ల ఫోటోలను పంచుకున్నారు. దీంతో ఈ రెండు జట్ల మధ్య తొలి మ్యాచ్‌ జరిగే అవకాశం ఉందనే ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *