వారిని పక్కన పెట్టి ప్రాక్టీస్ మొదలుపెట్టనున్న చెన్నై సూపర్ కింగ్స్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  4 Sep 2020 8:44 AM GMT
వారిని పక్కన పెట్టి ప్రాక్టీస్ మొదలుపెట్టనున్న చెన్నై సూపర్ కింగ్స్

ఈ ఏడాది ఐపీఎల్ కోసం యుఏఈకి చేరుకున్నాయి. క్వారెంటైన్ ముగిసిన తర్వాత ప్రాక్టీస్ సెషన్లతో బిజీ బిజీగా ఉన్నాయి జట్లు. అన్ని జట్లకు సంబంధించిన ప్రాక్టీస్ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తూ ఉన్నారు.. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు కాస్త బాధలో ఉన్నారు. ఎట్టకేలకు చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు ఓ గుడ్ న్యూస్ వచ్చింది.

కోవిద్-19 పాజిటివ్ వచ్చిన ఆటగాళ్లు, సిబ్బంది మినహా.. మిగిలిన వ్యక్తులు శుక్రవారం సాయంత్రం నుండి ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొననున్నారు. మహేంద్ర సింగ్ ధోనీ కూడా ఈ ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొనబోతున్నారు. ఈ మాట చెన్నై జట్టు యాజమాన్యానికి, అభిమానులకు పెద్ద రిలీఫ్ గా మారనుంది. దీని ద్వారా సెప్టెంబర్ 19న ముంబై ఇండియన్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడడం పక్కాగా అభిమానులు భావిస్తూ ఉన్నారు. దుబాయ్ కు వెళ్లకముందు చెన్నై జట్టు అయిదు రోజుల క్యాంపును ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.. ఆ తర్వాత ఆటగాళ్లు గ్రౌండ్ లోకి అడుగుపెట్టడం ఇదే మొదటిసారి.

'ఈరోజు ట్రైనింగ్ సెషన్ మొదలుకానుంది. ఆ 13 మంది మినహా.. మూడోసారి నెగటివ్ వచ్చిన ఆటగాళ్లందరూ ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొనబోతోన్నారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తుల ఐసొలేషన్ పిరియడ్ ముగిసిన వెంటనే మరోసారి టెస్టులు నిర్వహించనున్నాము' అని చెన్నై సూపర్ కింగ్స్ సిఈవో కె.ఎస్.విశ్వనాథన్ మీడియాకు తెలిపారు.

చెన్నై సూపర్ కింగ్స్ బృందంలో మొత్తం 13 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీపక్ చాహర్, రుతురాజ్ గైక్వాడ్ ఆటగాళ్లకు కూడా కరోనా పాజిటివ్ వచ్చిందని ఆగష్టు 28న తెలిపింది టీమ్ మేనేజ్మెంట్. దీంతో 14 రోజుల పాటూ సెల్ఫ్-ఐసొలేషన్ లోకి వెళ్లిపోయారు. మిగిలిన ఆటగాళ్లకు కూడా టెస్టులు చేసి నెగటివ్ వచ్చే వరకూ ట్రైనింగ్ సెషన్ ను మొదలుపెట్టలేదు. మరింత ఆలస్యం అవ్వకుండా ఆటగాళ్లను మ్యాచ్ కు రెడీ చేయాలని భావిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం కోవిద్-19 పాజిటివ్ వచ్చిన ఆటగాళ్లు, సిబ్బంది మినహా.. మిగిలిన వ్యక్తులు శుక్రవారం సాయంత్రం నుండి ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొనేలా ప్రణాళిక రూపొందిస్తోంది.

అనూహ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ నుండి తప్పుకున్న సురేష్ రైనా విషయంలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ధోని తర్వాత చెన్నై అభిమానులు ఎక్కువగా అభిమానించే ఆటగాడు రైనానే..! రైనా ఐపీఎల్ కు మిస్ అవుతాడా.. తిరిగి జట్టు లోకి వస్తాడా అన్నది తెలియాల్సి ఉంది.

Next Story