ఎంపీ రేవంత్‌రెడ్డి అరెస్ట్‌.. జన్వాడలో ఉద్రిక్తత

By అంజి
Published on : 2 March 2020 5:07 PM IST

ఎంపీ రేవంత్‌రెడ్డి అరెస్ట్‌.. జన్వాడలో ఉద్రిక్తత

ముఖ్యాంశాలు

  • జన్వాడ లో ఎంపీ రేవంత్ రెడ్డి అరెస్టు
  • రేవంత్ రెడ్డితో పాటు మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డి అరెస్టు
  • అక్రమంగా కేటీఆర్ ఫామ్ హౌస్ నిర్మించారు-రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌: జన్వాడలోని రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ ఫామ్‌హౌస్‌ దగ్గర మల్కాజ్‌గిరి ఎంపీ, కాంగ్రెస్‌ నేత రేవంత్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఎంపీ రేవంత్‌రెడ్డితో పాటు మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డిని అరెస్ట్‌ చేసినట్లు సమాచారం.

111 జీవోను తుంగలో తొక్కి మంత్రి కేటీఆర్‌ అక్రమంగా ఫామ్‌ హౌస్‌ నిర్మించారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. 25 ఎకరాల్లో మంత్రి కేటీఆర్ నిబంధనలకు వ్యతిరేకంగా ఫామ్ హౌస్ నిర్మాణం చేపట్టారని అన్నారు.

కాగా సోమవారం మంత్రి కేటీఆర్‌ ఫామ్‌హౌస్‌ ముట్టడికి రేవంత్‌రెడ్డి వెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు.. రేవంత్‌రెడ్డి జన్వాడ వద్ద అరెస్ట్ చేశారు. రేవంత్‌ రెడ్డి అరెస్ట్‌తో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

కేంద్ర ప్రభుత్వం నిబంధనలను సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌ అతిక్రమించారని రేవంత్‌రెడ్డి విమర్శించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని.. ఫామ్‌ హౌస్‌లో విలాసవంతంగా జీవితాన్ని గడుపుతున్నారని ఎంపీ రేవంత్‌రెడ్డి మండిపడ్డారు.

Next Story