ఏసీబీ కోర్టుకు ఎంపీ రేవంత్‌రెడ్డి

By అంజి  Published on  3 March 2020 7:34 AM GMT
ఏసీబీ కోర్టుకు ఎంపీ రేవంత్‌రెడ్డి

ముఖ్యాంశాలు

  • ఓటుకు నోటు కేసులో ఏసీబీ కోర్టుకు రేవంత్‌రెడ్డి
  • 2015లో ఓటుకు నోటు కేసులో రేవంత్‌ అరెస్ట్‌
  • రేవంత్‌రెడ్డితో పాటు పలువురిపై ఏసీబీ కేసులు

హైదరాబాద్‌: ఓటుకు నోటు కేసులో మల్కాజ్‌గిరి ఎంపీ, కాంగ్రెస్‌ నేత రేవంత్‌రెడ్డి ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు. 2015లో ఓటుకు నోటు కేసులో రేవంత్‌రెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌ సన్‌కు రూజ 50 లక్షలు ఇస్తుండగా రేవంత్‌రెడ్డి రెడ్‌ హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఈ కేసులో ఏ-1గా ఉన్న రేవంత్‌రెడ్డితో పాటు పలువురిపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. కేసు విచారణలో భాగంగా మంగళవారం రేవంత్‌రెడ్డి ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు. కొద్ది సేపు కోర్టు వాదనలు విన్నది. కాగా ఈ కేసు విచారణను మార్చి 17కు వాయిదా వేస్తున్నట్లు కోర్టు తెలిపింది.

2015లో ఓటుకు నోటు కేసు తెలంగాణలో సంచలనం రేపింది. ఈ కేసుపై ఏసీబీ సుదీర్ఘ విచారణ చేపట్టింది. రేవంత్‌రెడ్డిని గతంలో ఇన్‌కం ట్యాక్స్‌ అధికారులు, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు కూడా విచారించారు.

Next Story