మా భూములను అక్రమంగా లాక్కున్నారు.. ఎంపీ రేవంత్‌పై ఆరోపణలు

By అంజి  Published on  27 Feb 2020 1:12 PM IST
మా భూములను అక్రమంగా లాక్కున్నారు.. ఎంపీ రేవంత్‌పై ఆరోపణలు

రంగారెడ్డి: 'రివాల్వర్‌ గురిపెట్టారు' అంటూ నమస్తే తెలంగాణ దినపత్రిక కథనం రాసింది. ఆ కథనం మేరకు.. గోపనపల్లి భూ వివాదంలో మరో మలుపు చోటు చేసుకుంది. తాజాగా కొందరు వ్యక్తులు తమ భూములను ఎంపీ రేవంత్‌రెడ్డి, ఆయన సోదరులు అక్రమంగా లాక్కున్నారని ఆరోపించారు. సర్వే నంబర్‌ 127లోని తమదైన 10 ఎకరాల భూమి చుట్టూ ప్రహరీ గోడ కడుతుంటే అడ్డుకునేందుకు వెళ్లామని.. ఆ సమయంలో రేవంత్‌రెడ్డి సోదరులు రౌడీలను పంపి గేంటివేయించారని బాధితులు వాపోయారు.

నిబంధనలకు విరుద్ధంగా జరిగిన భూమి మ్యుటేషన్లలలో మరో ఇద్దరు అధికారులు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించిందని సమాచారం. రివాల్వర్‌తో చంపుతామని బెదిరింపులతో పాటు, పోలీస్‌ కేసులు కూడా నమోదు చేయించారని బాధితులు అంటున్నారు. 21 మందికి ఇప్పటికీ కోర్టుల చుట్టు తిరుగుతున్నామని రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ వద్ద ఓ మీడియా సంస్థకు చెప్పుకున్నారు. తమ భూమిని తమకు ఇప్పించాలని, అలాగే కేసుల నుంచి విముక్తి కల్పించాలని రైతులు నర్సింహ, రమేష్‌, శ్రీశైలం, దేవేందర్‌, యాదమ్మ, సంజీవ, జంగమ్మ, శ్రీనివాస్‌, స్వాతితో పాటు పలువురు కలెక్టర్‌కు తమ సమస్యను విన్నవించుకున్నారు. అనంతరం కలెక్టర్‌ స్పందిస్తూ.. ఆర్టీవో చంద్రకళలను కలవాలని సూచించారు.

సర్వేనంబర్‌ 127లోని 10.21 ఎకరల భూమి యాజమాని లక్ష్మయ్యకు మల్లయ్య, హన్మయ్య, ఎల్లయ్య, రామయ్య, కిష్టయ్య అనే ఐదుగురు కుమారులు.. వారి వారసులుగా కొన్ని సంవత్సరాలు ఈ భూమి విషయంలో పోరాటం చేస్తున్నామని బాధితులు పేర్కొన్నారు. లక్ష్మయ్య పేరు మీద ఉన్న భూమిని పెద్ద కుమారుడు మల్లయ్య పేరుతో మార్పులు చేశారని అన్నారు. ఆ తర్వాత మల్లయ్య పేరిట ఉన్న ఆ భూమిని ఆయన పెద్ద కుమారుడు లక్ష్మయ్య.. రేవంత్‌రెడ్డి సోదరుడు కొండల్‌రెడ్డి అమ్మాడన్నారు. తమకు తెలియకుండా భూమిని ఎలా అమ్మావని అడిగితే సమాధానం దాటవేస్తూ వచ్చారని బాధితులు పేర్కొన్నారు. అప్పుడే తాము పోలం వద్దకు వెళ్లి కూర్చున్నామని, అదే సమయంలో రేవంత్‌ సోదరులు గుండాగురి చేశారని బాధితులు చెప్పారు.

ఎంపీ రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్నారు. పెద్దల అవినీతి అక్రమాస్తులు బయటపెడుతుండడంతో వాటికి కౌంటర్‌ ఇచ్చే స్థితిలో ప్రభుత్వం లేదన్నారు. దీనిపై ప్రజల దృష్టిని మరల్చేందుకే కొత్త నాటకానికి తెరలెపిందన్నారు. బెదిరింపు రాజకీయాలకు ఏ మాత్రం భయపడేది లేదని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

Next Story