చెట్టు మీదున్న పాము.. ముంగీస అనుకుంటే ఇలాగే ఉంటుంది..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 9 Sept 2020 4:05 PM IST
పాము-ముంగీసల వైరం గురించి చిన్నప్పుడు ఎన్నో కథల్లో చదువుకున్నాం.. అందుకు తగ్గట్టే మన సినిమాల్లో కూడా పాము-ముంగీసల మధ్య వైరాన్ని చూపిస్తూ వచ్చారు. నిజంగా పాము-ముంగీసల మధ్య అంత వైరం ఉంటుందా అని మనకు అనిపించకమానదు. సామాజిక మాధ్యమాల్లో పాము, ముంగీసలు పోట్లాడుతున్న వీడియోలు ఎన్నో కనిపిస్తాయి. తాజాగా వీటి వైరానికి సంబంధించిన మరో వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూనే ఉంది.
Deputy Conservator of Forests ఆఫీసు, వెస్ట్ నాసిక్ డివిజన్, మహారాష్ట్ర కు చెందిన ట్విట్టర్ అకౌంట్ లో వీడియోను పోస్టు చేశారు. షార్ట్ వీడియోలో ఓ పాము చెట్టు కొమ్మల మీద సేద తీరుతూ ఉండగా.. కింద నుండి వచ్చిన ఓ ముంగీస పాము మీద దాడి చేసింది. పాముకు కనీసం తేరుకోడానికి కూడా సమయం ఇవ్వలేదు. కొద్దిసేపు ఆ పాము ప్రతిఘటించినప్పటికీ.. ఆఖరికి ముంగీసదే విజయం.
ముంగీసకు పాములను వేటాడే గుణం ఉంటుంది. అవి పాము కాటును తట్టుకోగలిగే ఇమ్యూనిటీ పవర్ ను కూడా సొంతం చేసుకుని ఉంటాయని నిపుణులు చెబుతూ ఉంటుంది. DCF West Nashik ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియోను పోస్టు చేసి 'బలవంతుడే బ్రతకగలడు' అంటూ అడవిలో చోటు చేసుకునే ఘటనల గురించి తెలిపారు.