కంటికి కనబడని శత్రువుతో మానవజాతి యుద్ధం చేస్తోంది: మోదీ

By సుభాష్  Published on  19 March 2020 8:34 PM IST
కంటికి కనబడని శత్రువుతో మానవజాతి యుద్ధం చేస్తోంది: మోదీ

చైనాలో పుట్టిన కరోనా వైరస్‌ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోందని, కంటికి కనబడని శత్రువుతో మానవ జాతివ జాతి యుద్ధం చేస్తోందని భారత ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. కరోనా వైరస్‌పై ఆయన మాట్లాడుతూ కరోనా రోజురోజుకు విజృంభిస్తున్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కరోనా కారణంగా ప్రపంచం మొత్తం గందరగోళంలో ఉందన్నారు. కరోనా వైరస్‌ను చూస్తుంటే మొదటి ప్రపంచ యుద్ధం నాటి పరిస్థితులు గుర్తుకు వస్తున్నాయన్నారు. ఈ మహమ్మారి మానవజాతిని సంక్షోభంలోకి నెట్టిందన్నారు. కరోనాను అంతం చేసేందుకు శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేస్తున్నారని, వ్యాక్సిన్‌ కనిపెట్టేందుకు సమయం పడుతుందన్నారు.

రవాణా రంగం, ఆటోలు, ట్యాక్సీలు నడిపేవారికి, మీడియా ప్రతినిధులకు, అలాగే హోటళ్లలో, ఆస్పత్రులు, విమానాశ్రయాల్లో పని చేసేవారికి కరోనా సోకే అవకాశాలున్నాయని, వీరు చేస్తున్న సేవలు అద్భుతమని కొనియాడారు. వీరందరికీ సెల్యూట్‌ చేస్తున్నానని అన్నారు.

కాగా, కరోనా వైరస్‌ కారణంగా ఇప్పటి వరకు 8వేలకుపైగా మృతి చెందారు. రెండు లక్షలకుపైగా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. భారత్‌తో ఇప్పటి వరకు 180కిపైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఐదుగురు మృతి చెందారు. ఇక తాజాగా తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 14కు చేరింది.

Next Story