ఆదివారం ఉదయం నుంచి రాత్రి ఎవరూ బయటకు రాకూడదు.. ఎందుకంటే

కరోనా వైరస్‌ ప్రపంచాన్ని వణికిస్తోంది. భారత్‌లో కూడా కరోనా విజృంభిస్తుండటంతో ప్రధాని నరేంద్రమోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈనెల 22న ఆదివారం జనతా కర్ప్యూ పాటిద్దామని అన్నారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జనతా కర్ప్యూ పాటించాలన్నారు. ఆ రోజు ఎవరూ కూడా ఇళ్ల నుంచి బయటకు రాకూడదని సూచించారు. ప్రజలను ఐసోలేషన్‌ వార్డులలో ఉంచడం ద్వారా కొన్ని దేశాలు కరోనాను కట్టడివ చేయగలిగాయని అన్నారు. కరోనా వ్యాపించకుండా దేశ ప్రజలు ముఖ్య భూమిక పోషించారని కొనియాడారు.

కరోనా వైరస్‌ కట్టడి కోసం గుంపులు, గుంపులుగా ఉండకుండా దూరంగా ఉండాలన్నారు. ఏకాంతంగా ఉండటం వల్లే ఈ వైరస్‌ను నియత్రించే అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ సమయంలో ప్రజలు సంయమనం పాటించాలని మోదీ పేర్కొన్నారు. అత్యవసరం అయితే తప్ప ఇంట్లో నుంచి ఎవరు కూడా బయటకు రావద్దని సూచించారు. రోజురోజుకు ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తుండటంతో కరోనా మరణాలు అధికమవుతున్నాయి. ఇప్పటికే 8వేలకు పైగా మృతి చెందగా, 2 లక్షల వరకు ఆస్పత్రలుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే భారత్‌లో ఈ వైరస్‌ 180కిపైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇక తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 14 కు చేరింది.

 

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *