ఐడియాలు ఇవ్వండి.. ప్రజలకు మోదీ అభ్యర్థన.. అదేంటంటే..

By సుభాష్  Published on  14 Jun 2020 1:29 PM GMT
ఐడియాలు ఇవ్వండి.. ప్రజలకు మోదీ అభ్యర్థన.. అదేంటంటే..

'మన్‌కీ బాత్‌' కోసం ప్రజలు ఐడియాలు, సలహాలు, సూచనలు ఇవ్వాలని ప్రధాని నరేంద్రమోదీ కోరారు. మన్‌కీ బాత కార్యక్రమం ఈనెల 28న ఉదయం 11 గంటలకు ప్రసారం కానుంది. అయితే ఇంకా సమయం ఉన్నందున ప్రజల నుంచి తమ ఆలోచనలను షేర్‌ చేయాలని, తద్వారా సాధ్యమైనన్నీ ఎక్కువ కాల్స్‌, కామెంట్లకు నేను స్పందించే అవకాశం ఉంటుందని మోదీ ట్వీట్‌ చేశారు. ముఖ్యంగా కోవిడ్‌ -19ను ఎదుర్కొవడం ఎలా అన్న అంశంపై ప్రధానంగా ఉంటుందన్న మోదీ.. వ్యక్తులు రికార్డు చేసిన మెసేజ్‌ని ఏ నెంబర్‌కు ఇవ్వాలో దానిని కూడా మోదీ షేర్‌ చేశారు. నమో యాప్‌ లేదా, గవర్నమెంట్‌ అన్ ఫోరాలకు తమ సూచనలు, సలహాలు ఇవ్వవచ్చని అన్నారు. మీరు ఇచ్చే ఐడియాలే ఈ కార్యక్రమాన్ని మరింత బలోపేతం చేస్తాయని మోదీ అభిప్రాయపడ్డారు.

తమ ఐడియాలను నమో యాప్‌లో, మై జవోవీ ఓపెన్‌ ఫోరంలో లేదా 1800-11-7800 నంబర్‌ ద్వారా రికార్డు చేయాలని ట్వీట్‌ చేశారు. రెండు వారాలు ఉన్నప్పటికీ దయచేసి మీ ఆలోచనలు ఇవ్వండి.. కరోనాతో పోరాడటం, దాని కంటే దానికంటే ఇంకా ఎక్కువగా చెప్పాల్సింది ఖచ్చితంగా ఉందని అనుకుంటున్నాను.. మీ ఆలోచనలు మన్‌కీ బాత్‌కి బలం ఇస్తాయి. ఇది 130 కోట్ల మంది ఇండియన్స్‌ బలాన్ని ప్రదర్శించే శక్తివంతమైన వేదికగా నిలిచింది.. అంటూ మోదీ ట్వీట్‌ చేశారు.

కాగా, ప్రతి నెల చివరి ఆదివారం మోదీ ప్రజలనుద్దేశించి ఆల్‌ ఇండియా రేడియో ద్వారా మన్‌కీ బాత్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇక గత నెలలో జరిగిన మన్‌కీ బాత్‌లో ఆయన కరోనా గురించి ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో వెనక్కి తగ్గవద్దని, సామాజిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరిస్తూ, చేతులు శుభ్రంగా కడుక్కొంటూ ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలను పాటించాలని మోదీ ప్రజలను కోరారు.



Next Story