రేపటి నుంచి జిల్లాలో కఠిన ఆంక్షలు.. ఉదయం 6 నుంచి 9 వరకూ మాత్రమే రోడ్లపైకి..

By సుభాష్  Published on  14 Jun 2020 7:10 AM GMT
రేపటి నుంచి జిల్లాలో కఠిన ఆంక్షలు.. ఉదయం 6 నుంచి 9 వరకూ మాత్రమే రోడ్లపైకి..

దేశంలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. కరోనా కేసులు, మరణాల సంఖ్య పెరుగుతుండటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇప్పటికే జూన్‌ 16 తర్వాత సంపూర్ణ లాక్‌డౌన్‌ విధిస్తారని సోషల్‌ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇక ఏపీలో కూడా కరోనా తీవ్ర స్థాయిలోనే ఉంది. అయితే ఏపీలోని అనంతపురం జిల్లాలో సోమవారం నుంచి కఠినమైన ఆంక్షలు విధించనున్నట్లు ఓ వార్త హల్‌ చల్‌ చేస్తోంది. ఈ ఆదేశాలు అనంతపురం జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఆదేశాలను బట్టి చూస్తే..

♦ జిల్లాలో ఉదయం 6 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకూ మూడు గంటల పాటు మాత్రమే రోడ్లపైకి జనాలను అనుమతి ఉంటుంది.

♦ పచారి షాపులు, పళ్ల మార్కెట్‌, రైతు బజార్లు ఉదయం 6 నుంచి ఉదయం 9 వరకు మాత్రమే తెరిచి ఉంటాయి.

♦ ఇక ఉదయం 4 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకూ డైరీ ప్రొడక్ట్‌ అందుబాటులో ఉంటాయి.

♦ ఉదయం 5 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకూ ఏటీఎం, ఫిల్లింగ్‌ వాహనాలకు అనుమతి.

♦ ఉదయం 7 నుంచి సాయంత్రం 7 గంటల వరకూ టెక్‌ ఎవే హోటళ్లకు అనుమతి.

♦ ప్రభుత్వం, పోలీస్‌, ఫైర్‌, ఎలక్ట్రీకల్‌, రెవెన్యూ, వీయంసీ, మెడికల్‌ అండ్‌, హెల్త్‌ డిపార్ట్‌ మెంట్‌ వాహనాలకు మాత్రమే అనుమతి.

♦ ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా వాహనాలకు, ఆయిల్‌, గ్యాస్‌ ఫిల్లింగ్‌ వాహనాలకు, మొబైల్‌ కమ్యూనికేషన్‌ వాహనాలకు ప్రత్యేక అనుమతి.

♦ జ్యువెలరీ, షాపింగ్‌ మాల్స్‌, ఫ్యాన్సీ షాపులు, ఎలక్ట్రానిక్‌ షాపులు, హార్డ్‌ వేర్‌, ఫర్నిచర్‌, బేకరీస్‌, రెడీమేడ్‌ షాప్స్‌, హోటళ్లు, రెస్టారెంట్లు, ఫుడ్‌ కోర్ట్‌, ఐరన్‌, స్టీల్‌ షాప్స్‌ పిజ్జాకాఫీ షాప్స్, మొబైల్ షాప్స్, ఆటోమొబైల్స్ తదితర షాపులు తెరిచేందుకు లాక్‌డౌన్ పూర్తయ్యే వరకు ఎలాంటి అనుమతి లేదు.

♦ ఇద్దరికంటే ఎక్కువ మంది గుమిగూడి ఉండరాదు.

♦ నిబంధనలు ఉల్లంఘించినట్లయితే కఠిన చర్యలు తప్పవంటూ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.

Next Story
Share it