సినీఫక్కీలో చోరీ.. రూ.7 కోట్ల విలువైన మొబైల్‌ ఫోన్లు మాయం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 Aug 2020 6:24 PM IST
సినీఫక్కీలో చోరీ.. రూ.7 కోట్ల విలువైన మొబైల్‌ ఫోన్లు మాయం

చిత్తూరు జిల్లా నగరి వద్ద సినీఫక్కీలో చోరి జరిగింది. మొబైల్‌ ఫోన్లతో వెలుతున్న లారీని దుండగులు అపహరించి.. ఆ లారీని మరో ప్రాంతంలో వదిలిపెట్టి పరారయ్యారు. ఈ ఘటనలో సుమారు రూ.7కోట్లు విలువైన మొబైల్‌ ఫోన్లు అపహరించినట్లు సమాచారం. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో కలకలం సృష్టించింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులోని కాంచీపురం శ్రీపెరంబూరు నుంచి ముంబైలోని షియోమీ సంస్థ గోదాముకు లారీలో మొబైల్‌ ఫోన్లను తీసుకువెలుతున్నారు. తమిళనాడు-ఏపీ సరిహద్దులో ఈ ఘటన జరిగింది. ఏపీ సరిహద్దులోకి రాగానే దుండగులు లారీని మరో లారీతో ఓవర్‌ టేక్‌ చేశారు. గన్‌తో డ్రైవర్‌ను బెదిరించి కాళ్లు, చేతులు కట్టేసి సెల్‌ఫోన్‌ లోడ్‌ ఉన్న లారీతో పరారయ్యారు. అయితే.. ఆ లారీని నగరి సమీపంలోని హైవేపై వదిలినట్లు పోలీసులు గుర్తించారు. మొబైల్‌ ఫోన్లను మరో లారీలోకి మార్చి ఉంటారని భావిస్తున్నారు. ఆ లారీలో 16 పెట్టెల్లో రూ.12కోట్ల విలువైన 15వేల మొబైల్‌ ఫోన్లను ఉన్నాయి. వీటిలో 8 పెట్టెల్లోని ఫోన్లను మాత్రమే దుండగులు అపహరించి మిగతా 8 పెట్టెలను వదిలేసి వెళ్లారు. డ్రైవర్‌ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Next Story