బ్రేకింగ్‌ : ఎమ్మెల్యేకు కరోనా.. సీఎంతో భేటీ కూడా అయ్యాడంట‌

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  15 April 2020 4:32 AM GMT
బ్రేకింగ్‌ : ఎమ్మెల్యేకు కరోనా.. సీఎంతో భేటీ కూడా అయ్యాడంట‌

క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తుంది. ఎప్పుడు, ఎక్క‌డ‌, ఎవ‌రు దీని బారిన ప‌డ‌తారోన‌ని దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన విష‌యం తెలిసిందే. అయినా రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయో త‌ప్పా.. ప‌రిస్థితుల‌లో ఎటువంటి మార్పు రావ‌ట్లేదు. ఇప్ప‌టివ‌ర‌కూ అధికారుల వ‌ర‌కే ప‌రిమిత‌మ‌యిన ఈ మ‌హ‌మ్మారి ఇప్పుడు ఓ ఎమ్మెల్యేకూ అంటుకుంది.

వివ‌రాళ్లోకెళితే.. గుజ‌రాత్ రాష్ట్రానికి చెందిన‌ జమలాపూర్ - ఖాడియా ప్రాంత కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇమ్రాన్ ఖేడావాలా గత కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారు. పరీక్షల నిమిత్తం శాంపిల్స్ కూడా ఇచ్చారు. అయితే.. ఆ రిజల్ట్స్ రాకముందే ఎమ్మెల్యే ఇంటినుండి బయటకు వచ్చి.. సీఎంతో సమావేశమయ్యారు. సీఎం విజయ్ రూపానీ, మరో ఇద్దరు మంత్రులను కలిసి చర్చలు జరిపారు. అయితే.. ఎమ్మెల్యే చ‌ర్చ‌లు జ‌రిపి వచ్చిన కొన్ని గంటల తరువాత.. ఓ ఎమ్మెల్యేకు కరోనా సోకినట్టు నిర్ధారణ కావడం.. ఆ వార్త మీడియాలో ప్రసార‌మ‌వ‌డంతో రాష్ట్ర ప్ర‌జ‌లు ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డ్డారు.

అయితే.. సీఎంను ఎమ్మెల్యే కలిసిన‌ వీడియో విడుదలైంది. ఈ వీడియోలో మంత్రులు, అధికారులు, సీఎం, ఎమ్మెల్యే సామాజిక దూరం పాటించినట్టు కనిపిస్తోంది. ఈ స‌మావేశంలో సీఎంతో పాటు రాష్ట్ర హోమ్, ఆరోగ్య మంత్రులు కూడా పాల్గొన్నారు.

ఇదిలావుంటే.. ప్రస్తుతం ఆ ఎమ్మెల్యేకు గాంధీనగర్ లోని ఎస్వీపీ ఆసుపత్రికి క్వారంటైన్ నిమిత్తం త‌ర‌లించాల‌మ‌ని అధికారులు తెలిపారు. అలాగే.. కొద్ద‌రోజులుగా ఎమ్మెల్యేను కలిసిన వారందరినీ ముందు జాగ్రత్తగా క్వారంటైన్ చేశామని అధికారులు వెల్లడించారు.

Next Story