బ్రేకింగ్ : ఎమ్మెల్యేకు కరోనా.. సీఎంతో భేటీ కూడా అయ్యాడంట
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 15 April 2020 4:32 AM GMTకరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తుంది. ఎప్పుడు, ఎక్కడ, ఎవరు దీని బారిన పడతారోనని దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. అయినా రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయో తప్పా.. పరిస్థితులలో ఎటువంటి మార్పు రావట్లేదు. ఇప్పటివరకూ అధికారుల వరకే పరిమితమయిన ఈ మహమ్మారి ఇప్పుడు ఓ ఎమ్మెల్యేకూ అంటుకుంది.
వివరాళ్లోకెళితే.. గుజరాత్ రాష్ట్రానికి చెందిన జమలాపూర్ - ఖాడియా ప్రాంత కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇమ్రాన్ ఖేడావాలా గత కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారు. పరీక్షల నిమిత్తం శాంపిల్స్ కూడా ఇచ్చారు. అయితే.. ఆ రిజల్ట్స్ రాకముందే ఎమ్మెల్యే ఇంటినుండి బయటకు వచ్చి.. సీఎంతో సమావేశమయ్యారు. సీఎం విజయ్ రూపానీ, మరో ఇద్దరు మంత్రులను కలిసి చర్చలు జరిపారు. అయితే.. ఎమ్మెల్యే చర్చలు జరిపి వచ్చిన కొన్ని గంటల తరువాత.. ఓ ఎమ్మెల్యేకు కరోనా సోకినట్టు నిర్ధారణ కావడం.. ఆ వార్త మీడియాలో ప్రసారమవడంతో రాష్ట్ర ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
అయితే.. సీఎంను ఎమ్మెల్యే కలిసిన వీడియో విడుదలైంది. ఈ వీడియోలో మంత్రులు, అధికారులు, సీఎం, ఎమ్మెల్యే సామాజిక దూరం పాటించినట్టు కనిపిస్తోంది. ఈ సమావేశంలో సీఎంతో పాటు రాష్ట్ర హోమ్, ఆరోగ్య మంత్రులు కూడా పాల్గొన్నారు.
ఇదిలావుంటే.. ప్రస్తుతం ఆ ఎమ్మెల్యేకు గాంధీనగర్ లోని ఎస్వీపీ ఆసుపత్రికి క్వారంటైన్ నిమిత్తం తరలించాలమని అధికారులు తెలిపారు. అలాగే.. కొద్దరోజులుగా ఎమ్మెల్యేను కలిసిన వారందరినీ ముందు జాగ్రత్తగా క్వారంటైన్ చేశామని అధికారులు వెల్లడించారు.