ప్రగతిభవన్‌ ముట్టడికి య‌త్నం‌ : ఎమ్మెల్యే సీతక్క అరెస్ట్‌

By న్యూస్‌మీటర్ తెలుగు
Published on : 18 Sept 2020 5:41 PM IST

ప్రగతిభవన్‌ ముట్టడికి య‌త్నం‌ : ఎమ్మెల్యే సీతక్క అరెస్ట్‌

కాంగ్రెస్‌ కిసాన్‌ సెల్ ఆధ్వ‌ర్యంలో ప్రగతిభవన్‌ ముట్టడికి బ‌య‌లుదేరిన‌ ములుగు ఎమ్మెల్యే సీతక్కను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో సీత‌క్క‌ ఉగ్రరూపం ప్రదర్శించారు. కారు దిగే సమయంలో తనపై చేయవేసిన మహిళా పోలీస్‌ను సీతక్క హెచ్చరించారు. చేయి ఎందుకు వేస్తావంటూ ఫైర‌య్యారు.

రైతుల గురించి అసెంబ్లీలో చర్చించలేని కేసీఆర్‌ ప్రభుత్వం నిస్సిగ్గుగా పోలీసుల‌తో మ‌మ్మ‌ల్ని అడ్డుకుంటుంద‌ని అన్నారు. భారీ వర్షాలకు నష్టపోయిన‌ పంటలకు రైతుల‌కు పరిహారం ఇవ్వాలని సీతక్క డిమాండ్‌ చేశారు. సభలో కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదని ఆమె మండిపడ్దారు. ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వమని దుయ్యబట్టారు.

ఈ నేపథ్యంలో పోలీసులు, ఎమ్మెల్యే సీతక్క మధ్య తోపులాట జరిగింది. దీంతో ఆమెతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Next Story