స్థల వివాదంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్

By Medi Samrat  Published on  26 July 2020 12:25 PM GMT
స్థల వివాదంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్.. ఖైరతాబాద్‌కు చెందిన ఓ స్థల వివాదంలో ‌బ్యాంక్‌ అధికారులతో వ్యవహరించిన తీరు ఇప్పుడు వివాదాస్పదమైంది. ఎమ్మెల్యే తమను బెదిరించారంటూ బ్యాంక్‌ అధికారులు పోలీసులను ఆశ్రయించారు. చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్‌ చేశారు.

వివ‌రాళ్లోకెళితే.. 10 ఏళ్ల క్రితం ఖైరతాబాద్‌లోని ఓ స్థలంపై ఓ వ్యక్తి లోన్‌ తీసుకున్నాడు. డబ్బులు తిరిగి కట్టకపోవడంతో ఆ స్థలాన్ని బ్యాంక్‌ బహిరంగ వేలానికి పెట్టారు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న దానం నాగేందర్‌ బ్యాంక్‌ అధికారుల విధులకు అడ్డుతగిలారు. బ్యాంకు వాళ్లు ఎలాంటి ప్రకటన ఇవ్వకుండా అలా ఎలా ఇస్తారంటూ.. బ్యాంకు సిబ్బందిపై దానం నాగేందర్ దురుసుగా ప్రవర్తించారు. స్థలం తమకే కేటాయించేలా చర్యలు తీసుకోవాలని బ్యాంకు అధికారులపై బెదిరింపులకు దిగారు.

ఎమ్మెల్యే తన అనరుచరులతో కలిసి వేలాన్ని అడ్డుకున్నారని.. బ్యాంక్‌ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే తమపై దౌర్జన్యం చేశారని, బెదిరింపులకు దిగారని తెలిపారు. ఆయన అనుచరులు దూషించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బ్యాంకు అధికారులను దానం బెదిరిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Next Story