హైదరాబాద్‌ మేయర్‌ బొంతు రామ్మోహన్‌కు కరోనా పాజిటివ్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 July 2020 10:20 AM GMT
హైదరాబాద్‌ మేయర్‌ బొంతు రామ్మోహన్‌కు కరోనా పాజిటివ్

తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రాష్ట్రంలో సమూహ వ్యాప్తి ప్రారంభమైందని రెండు రోజుల క్రితం ఆరోగ్య శాఖ వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజాగా జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ కరోనా బారీన పడ్డారు. ఈ రోజు ఆయనకు నిర్వహించిన కరోనా పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్థారణ అయింది. కాగా.. ఆయన కుటుంబ సభ్యులకు మాత్రం నెగిటివ్‌ వచ్చింది. దీంతో ఆయన హోం క్వారంటైన్‌లోకి వెళ్లారు. ఆయనకు ఎటువంటి లక్షణాలు లేవని చెబుతున్నారు.

మేయర్ డ్రైవర్ కు గత నెలలో కరోనా సోకడంతో మేయర్ రెండు సార్లు టెస్ట్ చేయించుకున్నారు. అప్పుడు కరోనా నెగటివ్ ఒచ్చింది. అయితే కరోనా కట్టడిలో భాగంగా ఆయన నగరంలో పర్యటిస్తున్న క్రమంలో ఈ ర్యాపిడ్ టెస్ట్ చేయించుకోగా ఆయనకు పాజిటివ్ అని తేలింది. సెల్ఫ్ ఐసోలేషన్ అనంతరం ప్లాస్మా ఇచ్చేందుకు కూడా మేయర్ సంసిద్ధత వ్యక్తం చేశారు. అదే విదంగా కరోనా నుండి కోలుకున్న ఇతర వ్యక్తులతో కలిసి పెద్ద ఎత్తున ప్లాస్మా డొనేట్ చేసేందుకు తెలంగాణ భవన్ లో ప్రత్యేక క్యాంపు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కరోనా పాజిటివ్ రావడంతో సెల్ఫ్ ఐసొలేషన్ లో ఉంటూనే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మేయర్ అధికారులతో సమీక్షిస్తున్నారు. వర్షాకాలమైనందున సీజనల్ వ్యాధులు, దోమల వ్యాప్తిని నియంత్రించుటలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని నగర ప్రజలకు మేయర్ సూచించారు.

Next Story