తెలంగాణలో కొత్తగా 1593 పాజిటివ్‌ కేసులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 July 2020 6:24 AM GMT
తెలంగాణలో కొత్తగా 1593 పాజిటివ్‌ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. శనివారం రాత్రి 8గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 15,654 సాంపిల్స్‌ను పరీక్షించగా.. కొత్తగా 1,593 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 8 మంది మృత్యువాత పడినట్లు వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీటితో కలిపి రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 54,059కి చేరింది. ఈ మహమ్మారి బారీన పడి మొత్తం 463 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం నమోదు అయిన కేసుల్లో ప్రస్తుతం 12,264 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా.. 41,332 మంది కోలుకున్నారు.

అత్య‌ధికంగా జీహెచ్ఎంసీలో 641 కేసులు, రంగారెడ్డి జిల్లాలో 171 కేసులు, వరంగల్‌ అర్భన్‌ 131, కరీంనగర్‌ 51, మహబూబ్‌ నగర్‌ 38, మేడ్చల్‌ 91, మహబూబాబాద్‌ 29, మంచిర్యాల 27, కామారెడ్డి 36, నిజామాబాద్‌ 32, రాజన్న సిరిసిల్ల 27, సూర్యాపేట 22, సంగారెడ్డి 61 చొప్పున కేసులు నమోదు అయ్యాయి.Next Story