జోగులాంబ గద్వాల జిల్లాలో విషాదం.. వాగులో మహిళ గల్లంతు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 July 2020 6:00 AM GMT
జోగులాంబ గద్వాల జిల్లాలో విషాదం.. వాగులో మహిళ గల్లంతు

జోగులాంబ గద్వాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఉద్దృతంగా ప్రవహిస్తున్న వాగులో ప్రమాదవశాత్తు కారుతో సహా మహిళ గల్లంతైంది. వివరాల్లోకి వెళితే.. ఉండవెల్లి మండలం కలుగొట్ల గ్రామ సమీపంలో రోడ్డుపై నుంచి వాగు ఉద్దృతంగా ప్రవహిస్తోంది. కర్నూలు నుంచి హైదరాబాద్‌కు బయలు దేరిన మహిళ కుటుంబం కలుగొట్ల సమీపంలోకి రాగానే.. వాగు ప్రవాహాన్ని గమనించిన కుటుంబ సభ్యులు కారు దిగారు.

మహిళ కారును నిదానంగా వాగు దాటించే ప్రయత్నం చేసింది. అయితే.. వరద ప్రవాహాం అధికంగా ఉండడంతో కారుతో సహా మహిళ కొట్టుకుపోయింది. గల్లంతైన మహిళను పులివెందులకు చెందిన సింధూరెడ్డిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు, గ్రామస్తులు అక్కడికి చేరుకుని గల్లంతైన మహిళ కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.

Next Story