ఎమ్మెల్యే అంబటికి కరోనా పాజిటివ్‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  22 July 2020 6:00 PM IST
ఎమ్మెల్యే అంబటికి కరోనా పాజిటివ్‌

ఏపీలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా 4వేలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. కరోనా ఎవ్వరిని వదలడం లేదు. సామాన్యుల నుంచి మొదలు కొని ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ మహమ్మారి బారీన పడుతున్నారు. తాజాగా వైసీపీ సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది.

అంబటి రాంబాబు కరోనా టెస్టు చేయించుకోగా ఆయనకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు. తనకు కరోనా పాజిటివ్‌ వచ్చిన విషయం ఉదయం తెలిసిందని, ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నానని, తనకు చాలా మంది కాల్స్ చేసి అడుగుతున్నారని, అన్ని కాల్స్‌ ను ఎత్తడం కుదరడం లేదని, అందుకనే వీడియో విడుదల చేస్తున్నట్లు తెలిపారు.

ఇప్పటికే వైసీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు కరోనా బారినపడ్డారు. తాజాగా అంబటి రాంబాబుతో ఆ సంఖ్య మూడుకు చేరింది. ఇప్పటికే పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్య, తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తిన శివ కుమార్ కరోనా బారినపడ్డారు. అయితే వీరిలో పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్య పూర్తిగా కోలుకున్నారు. ఇక తెనాలికి చెందిన ఎమ్మెల్యే శివ కుమార్ హోం క్వారంటైన్‌లోనే ఉన్నారు.

Next Story