కరోనా వైరస్‌(కొవిడ్‌-19) ప్రపంచాన్ని వణికిస్తోంది. కరోనా హైదరాబాద్‌లోకి ప్రవేశించిన నేపథ్యంలో రాష్ట్ర వైద్య, అరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్ని ప్రభుత్వ ఆస్పత్రులను సందర్శిస్తున్నారు. సోమవారం శంషాబాద్ ఎయిర్ పోర్టులోని స్క్రీనింగ్ పరికరాలను మంత్రి పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు.  శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు విదేశాల నుంచి ప్రతి రోజు 550 మంది వస్తుంటారు. కాబట్టి వారందరికి కరోనా స్కానింగ్‌ పరీక్షలు తప్పనిసరిగా చేయాలన్నారు. ఎయిర్‌పోర్ట్‌లో నాలుగు ప్రధాన ద్వారాలు ఉన్నాయి. ప్రతి ద్వారం వద్ద డాక్టర్లు, నర్సులు, హెల్పర్లు ఉన్నారు. విదేశాల నుంచి వచ్చే ప్రతి వ్యక్తి స్కానింగ్‌ చేస్తారు. ఎవరిలోనైనా కరోనా లక్షణాలు కనిపిస్తూ ఎయిర్‌పోర్ట్‌లో ఏర్పాటు చేసిన గదిలోకి తీసుకెళ్లి.. మాస్కులు వేసి ప్రత్యేక వాహానంలో గాంధీ ఆస్పత్రికి తరలిస్తారని మంత్రి తెలిపారు.

గతంలో 11, 12 దేశాల నుండి వచ్చే ప్రయాణీకులకు మాత్రమే పరీక్షలు నిర్వహించామని, ఇప్పుడు మాత్రం విదేశాల నుంచి వచ్చే అందరికి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఒక్క ప్రయాణికుడు కూడా తప్పిపోకుండా అందరినీ స్కానింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.