దేవినేని ఉమాకు మంత్రి అనిల్ సవాల్
By తోట వంశీ కుమార్ Published on 15 May 2020 8:45 PM ISTపోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌పై టీడీపీ వైఖరి ఏంటో చెప్పాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. రెండు రాష్ట్రాల మధ్య(ఆంధ్ర, తెలంగాణ) వివాదం నెలకొన్న నేపథ్యంలో టీడీపీ నేతలు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టును 70శాతం పూర్తి చేశామని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పుకుంటూ తిరుగుతున్నారని, ఒకవేళ దానిని నిరూపిస్తే తన మీసం తీసేసి తిరుగుతానని మంత్రి అనిల్ సవాల్ విసిరారు.
వెలిగొండ ప్రాజెక్టు టీడీపీ హయాంలో పూర్తైందని చెప్పుకోవడం సిగ్గుచేటు అని మంత్రి అనిల్ దుయ్యబట్టారు. వైఎస్ కట్టిన పట్టిసీమను తామే కట్టామని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. రాయలసీమకు నష్టం చేసింది టీడీపీ ప్రభుత్వం కాదా? అని ప్రశ్నించారు. నిజంగా సీమకు న్యాయం చేసి ఉంటే ప్రజలు పది సీట్లు అయినా ఇచ్చేవాళ్లని అన్నారు. టీడీపీ హయాంలో ఏ ప్రాజెక్టు పూర్తి కాలేదని పేర్కొన్నారు.