కొన్ని కోట్ల ఆండ్రాయిడ్ ఫోన్లకు ప్రమాదం పొంచి ఉందా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  8 Aug 2020 1:09 PM GMT
కొన్ని కోట్ల ఆండ్రాయిడ్ ఫోన్లకు ప్రమాదం పొంచి ఉందా..?

క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ చిప్ ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్లకు ప్రమాదం పొంచి ఉందట..! ప్రపంచ వ్యాప్తంగా మొత్తం మూడు బిలియన్ల ఆండ్రాయిడ్ ఫోన్లకు రిస్క్ ఉందని చెబుతున్నారు. క్వాల్ కామ్ డిజిటల్ సిగ్నల్ ప్రాసెసర్ లో 400 పైగా తప్పులు ఉన్నట్లు చెక్ పాయింట్ సెక్యూరిటీ రీసర్చర్లు తాజాగా వెల్లడించారు.

క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ చిప్ ను 40 శాతం స్మార్ట్ ఫోన్లలో వాడుతూ ఉన్నారు. వివిధ ప్రైస్ రేంజిలో ఉన్న మొబైల్ ఫోన్లలో వీటిని వినియోగిస్తూ ఉన్నారు. గూగుల్, శాంసంగ్, ఎల్జీ, షియోమీ కంపెనీల ప్రీమియం మొబైల్స్ లో కూడా ఈ స్నాప్ డ్రాగన్ చిప్ ను వాడుతూ ఉన్నారు. వీటిని పరీక్షించిన చెక్ పాయింట్.. ఈ చిప్ కు సంబంధించిన కోడ్ లో 400కు పైగా తప్పులు ఉన్నట్లు గుర్తించింది. వీటిని వాడుకుని హ్యాకర్లు మొబైల్ ఫోన్ లను తమ ఆధీనంలోకి తీసుకునే అవకాశం ఉంది. ఫోటోలు, వీడియోలు, కాల్ రికార్డ్స్, రియల్ టైమ్ మైక్రోఫోన్ డేటా, జీపీఎస్ లొకేషన్ డేటాను ఈజీగా సేకరించే అవకాశం ఉంది.

కావాలంటే ఫోన్ ను హ్యాకర్లు ఫ్రీజ్ చేసే అవకాశం ఉందని హెచ్చరిస్తూ ఉన్నారు. ఫోన్ లోని డేటా శాశ్వతంగా అందుబాటులో ఉండే అవకాశం ఉంది. హ్యాకర్లు మాల్వేర్, కొన్ని కోడ్స్ ను ఫోన్ లలోకి ఇంజెక్ట్ చేసే అవకాశం ఉంది. ఈ పొరపాటు ఎలా జరిగింది అన్న విషయాన్ని చెక్ పాయింట్ సంస్థ వెల్లడించలేదు.

Next Story