వాట్సాప్ పే.. త్వరలోనే భారత్ లో సేవలు మొదలు..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  4 Aug 2020 6:03 AM GMT
వాట్సాప్ పే.. త్వరలోనే భారత్ లో సేవలు మొదలు..!

వాట్సాప్ పే చెల్లింపు సేవ - వాట్సాప్ 2018 నుంచి పైలట్ ప్రాజెక్టులో భాగంగా 2018 ఫిబ్రవరి నుంచి వాట్సాప్-పే సేవలను అందుబాటులోకి తెచ్చింది. భారతీయ రిజర్వు బ్యాంకు విధించిన నియమ, నిబంధనల వలన వాట్సాప్ -పే ఫీచర్ భారత్ లో అధికారికంగా వినియోగదారులకు అందుబాటులోకి రాలేదు. ఆర్బీఐ నియమ నిబంధనలన్నీ వాట్సాప్ పూర్తి చేసినట్లు తెలుస్తోంది.

అతిత్వరలోనే పేమెంట్ సర్వీసులును అందుబాటులోకి తీసుకువస్తామని వాట్సాప్ తాజాగా ప్రకటించింది. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా డేటా లోకలైజేషన్ పేమెంట్స్ నిబంధనలను అనుగుణంగా తాము సర్వీసులు అందిస్తామని స్పష్టం చేయడంతో ఇక త్వరలోనే వాట్సాప్ సేవలు భారత్ లో మొదలుకానున్నాయి. దీనికి ఎన్‌పీసీఐ కూడా సుముఖంగా ఉందని పేర్కొంది. ఆర్‌బీఐ నిబంధనలకు అనుగుణంగా పేమెంట్ సర్వీసులు అందించడానికి గత ఏడాది కాలంగా వాట్సాప్ టీమ్ ప్రయత్నిస్తోంది. వాట్సాప్ పైలెట్ ప్రాజెక్ట్ కింద కొంత మందికి పేమెంట్ సర్వీసులు అందిస్తోంది.

వాట్సాప్ భారతదేశంలో తన సేవలను మరింత విస్తరించాలని భావిస్తోంది. బీమా, మైక్రో ఫైనాన్స్ (చిన్న రుణాలు), పెన్షన్ వంటి సేవలను వాట్సాప్ సంస్థ త్వరలో ప్రారంభించనుంది. ఆర్థిక ఉత్పత్తులను సులభంగా పొందటానికి భారతదేశంలోని బ్యాంకులు మరియు ఆర్థిక సంస్థల వంటి భాగస్వాములతో కలిసి పని చేస్తుంది. వాట్సాప్ కూడా యూపీఐ ఆధారిత సేవా వినియోగదారులకు డబ్బు పంపించడానికి , స్వీకరించడానికి అనుమతించనుంది.

Next Story