వైన్ ప్రియులకు మేఘాలయ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేర‌కు ఆ రాష్ట్ర‌ స‌ర్కార్ ఇంట్లోనే వైన్ తయారీకి తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో రాష్ట్రంలో రెండు దశాబ్దాలుగా స్థానికంగా వైన్ తయారీని చట్టబద్ధం చేయాలనే డిమాండుకు డెమోక్రటిక్ అలయెన్సు ప్రభుత్వం తలొగ్గి హోంమేడ్ ఫ్రూట్ వైన్సు రూల్ ను ప్రవేశపెట్టింది. మేఘాలయంలో వైన్ తయారీదారులకు లైసెన్సులు ఇవ్వాలని మేఘాలయ మంత్రివర్గం నిర్ణయించింది.

ఈ మేర‌కు ఆ రాష్ట్రంలోని ఇళ్ల‌ల్లో తయారు చేసిన వైన్ ను మార్కెటులో విక్రయించేందుకు అనుమతిస్తున్నట్లు ముఖ్యమంత్రి కాన్రాడ్ కె సంగ్మా తెలిపారు. ఇళ్లలోనే వైన్ తయారీకి అనుమతివ్వడం వల్ల ఉత్పాదకత పెరగడంతోపాటు స్థానికులకు ఉపాధి అవ‌కిశం లభిస్తుందని సీఎం అన్నారు.

ఇదిలావుంటే.. వైన్ తయారీదారులు వ్యాట్ చెల్లించాల్సిన అవసరం లేద‌ని.. లైసెన్సు ఫీజు కింద మాత్రం రూ. 7,500రూపాయలు చెల్లిస్తే చాలని మేఘాలయ అధికారులు వెల్ల‌డించారు. ఇక‌ మేఘాలయ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు మేఘాలయ వైన్ మేకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మైఖేల్ అన్నారు. స‌ర్కార్ తీసుకున్న ఈ నిర్ణ‌యంతో.. పర్యాటకరంగం అభివృద్ధితోపాటు వైన్ తయారీ కుటీరపరిశ్రమగా పురోగతి చెందుతుందని స్థానికులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.
antalya escort
anadolu yakası escort maltepe escort escort bayan kartal escort ataşehir escort pendik escort bostancı escort kurtköy escort maltepe escort kartal escort