Fact Check : ప్రభుత్వం విద్యార్థులకు ఉచితంగా ల్యాప్ టాప్ లను ఇస్తోందా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  26 Sep 2020 3:07 AM GMT
Fact Check : ప్రభుత్వం విద్యార్థులకు ఉచితంగా ల్యాప్ టాప్ లను ఇస్తోందా..?

లాక్ డౌన్ కారణంగా విద్యార్థులంతా ఇళ్లకే పరిమితమయ్యారు. పాఠశాలలు, కాలేజీలకు దేశంలోని చాలా రాష్ట్రాలలో అనుమతులు రాలేదు. చాలామంది విద్యార్థులు ఆన్ లైన్ క్లాసుల్లో చదువును కొనసాగిస్తూ వస్తున్నారు. అందుకు తగ్గట్టుగా మొబైల్ ఫోన్స్, ల్యాప్ టాప్ లలో క్లాసులు వింటూ ఉన్నారు. అందరికీ మొబైల్స్, ల్యాప్ టాప్ లు అందుబాటులో ఉండకపోవచ్చు. దీంతో ప్రభుత్వం ఉచితంగా ల్యాప్ టాప్ లను అందిస్తోందంటూ ప్రచారం చేస్తూ ఉన్నారు.



“Due to coronavirus schools and colleges have been closed and because of this, the education of students has been affected. The government is providing free laptops to all the students so that they can complete their education and also give exams with the help of the internet,” అనే మెసేజ్ వైరల్ అవుతోంది. కరోనా వైరస్ కారణంగా స్కూల్స్, కాలేజీలు మూసి వేశారు.. దీంతో విద్యార్థుల చదువుకు ఇబ్బంది కలిగింది. ప్రభుత్వం ఆ ఇబ్బందులను చూసి విద్యార్థులకు ఉచితంగా ల్యాప్ టాప్ లను ఇవ్వాలని అనుకుంటోందన్నది ఆ మెసీజీ సారాంశం. విద్యార్థులు ఈ ల్యాప్ టాప్ ల ద్వారా విద్యను పూర్తీ చేయొచ్చు, అలాగే పరీక్షలు కూడా రాయవచ్చు అని ప్రచారం చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా ఓ లింక్ ను కూడా వైరల్ చేస్తున్నారు.

02

ఈ వార్తలో ఎంత వరకూ నిజం ఉందో తెలియజేయాలని న్యూస్ మీటర్ కు వాట్సప్ లో రిక్వెస్ట్ అందింది.

నిజ నిర్ధారణ:

వైరల్ అవుతున్న మెసేజీని వెరిఫై చేయాలని చూడగా అందులో ఇచ్చిన లింక్ “http://bit.ly/Register-For-Free-Laptop-Here” అసలు పని చేయడం లేదు. ఇంటర్నెట్ లో ఆ లింక్ ను క్లిక్ చేస్తే ఎటువంటి రెస్పాన్స్ లేదు. ముఖ్యంగా అది ఒక బ్లాగ్ సర్వీస్ అని అర్థమవుతోంది. అది ప్రభుత్వంకు సంబంధించిన అఫీషియల్ వెబ్ సైట్ కాదు.

03

ఒకవేళ అలాంటి ఏదైనా అనౌన్స్మెంట్ ఉంటే అధికారిక వెబ్సైట్లలో సమాచారాన్ని పొందుపరుస్తారు.

ప్రభుత్వ వెబ్సైట్లను పరిశీలించగా అలాంటి సమాచారం ఏదీ కనిపించలేదు.

ఈ మధ్య కాలంలో ఇలాంటి వార్తలు వైరల్ అవ్వడం కొత్తదేమీ కాదు. ఆగష్టు నెలలో కూడా పలువురు ఇలాంటి మెసేజీలను వైరల్ చేశారు. ప్రభుత్వం వర్చువల్ లెర్నింగ్ ను విద్యార్థుల్లో తీసుకుని వెళ్లాలని ఈ నిర్ణయం తీసుకుందంటూ సోషల్ మీడియాలో మెసేజీలు వైరల్ కాగా.. అది ఫేక్ న్యూస్ అని తర్వాత తేలింది.

ప్రభుత్వం విద్యార్థులకు ల్యాప్ టాప్ లను, స్మార్ట్ ఫోన్, ట్యాబ్ లను సరఫరా చేయడం లేదు. న్యూస్ మీటర్ ఇప్పటికే ఇలాంటి వార్తల్లో నిజం లేదని తేల్చి చెప్పింది. కొందరు పర్సనల్ డేటాను తీసుకోడానికి కూడా ఇలాంటి మెసేజీలను వైరల్ చేస్తున్నారు. ఇలాంటి వాటి మాయలో పడకూడదని ప్రజలకు సూచించింది ప్రభుత్వం.

వైరల్ అవుతున్న పోస్టులో 'ఎటువంటి నిజం లేదు'.

Next Story