నిహారిక నిశ్చితార్థంలో మెగా హీరోల సందడి
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 14 Aug 2020 12:27 PM ISTబుల్లితెర నవ్వులబాబు.. నాగబాబు కుమార్తె నిహారిక నిశ్చితార్థం గురువారం రాత్రి హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. గుంటూరు రేంజ్ ఐజీ ప్రభాకర్ రావు కుమారుడు చైతన్యతో నిహారిక నిశ్చితార్థం జరిగింది. ఇరు కుటుంబాల సమక్షంలో జరిగిన ఈ ఎంగేజ్‌మెంట్‌కు అతి కొద్ది మంది అతిథులు మాత్రమే హాజరయ్యారు.
నిశ్చితార్థానికి మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ సతీసమేతంగా హాజరు కాగా.. సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, శ్రీజ, సుస్మిత, కళ్యాణ్ దేవ్, వరుణ్ తేజ్ తదితరులు హాజరై సందడి చేశారు. వేడుకలో అల్లు అర్జున్ తన సతీమణి స్నేహా రెడ్డితో కలిసి స్టైలిష్ లుక్‌లో మెరవడంతో పాటు పార్టీకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఇదిలావుంటే.. మెగా ఫ్యామిలీకి అల్లుడుగా రాబోతున్న జొన్నల గడ్డ చైతన్య విషయానికి వస్తే.. చైతన్య కుటుంబంతో మెగా ఫ్యామిలీకి ఎప్పటి నుంచో పరిచయం ఉండటం.. చిరంజీవి తండ్రి కొణిదెల వెంకటరావు, చైతన్య తాతయ్య గుణ వెంకటరత్నం ప్రాణ స్నేహితులు కావడంతో ఈ సంబంధం సెట్ అయినట్టుగా తెలుస్తోంది. చైతన్య స్వస్థలం గుంటూరు కాగా.. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఎంబీఏ పూర్తిచేశారు.
Clicks from @IamNiharikaK's Engagement #NiharikaEngagement pic.twitter.com/fpv1dylMaW
— BARaju (@baraju_SuperHit) August 14, 2020