మీనల్ మీను.. టిక్‌టాక్ స్టార్.. ఏం చేసిందో చూడండి.!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 22 April 2020 1:39 PM GMT
మీనల్ మీను.. టిక్‌టాక్ తెలిసిన వాళ్లకు పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. 4.2 మిలియన్ల టిక్‌టాక్ పాలోవర్స్‌తో తెలంగాణలోనే అత్యధిక పాలోయింగ్ ఉన్న స్టార్. ఇప్పుడు ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా..? మాట్లాడాలి.. తన గురించి ఈ రోజు పక్కా మాట్లాడాలి. ఎందుకంటే.. మీనల్‌ది ఈ రోజు బర్త్ డే. తన పుట్టినరోజు సందర్బంగా తనో నిర్ణయం తీసుకుంది. అందుకు మాట్లాడాలి మీనల్ గురించి.
కరోనా కారణంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న నేఫథ్యంలో మీనల్ మల్కాజిగిరి పరిధిలోని తన పరిసరాలను శానిటైజ్ చేసేందుకు నిర్ణయం తీసుకుంది. అనుకున్నదే తడువుగా.. స్ప్రేయర్ చేతపట్టి ముందుకు కదిలింది. పనిలోపనిగా మల్కాజిగిరి పోలీసు స్టేషన్లో కూడా క్రిమి సంహారక మందును స్ప్రే చేసింది. ఈ విషయాన్ని మీనల్ తల్లి దీనా తన ట్విటర్ ఎకౌంట్‌లో షేర్ చేశారు. పుట్టినరోజు నాడు ఓ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడంతో మీనల్‌కు అభినందనలు వెల్లువెత్తున్నాయి.