అలా వర్షం పడింది.. ఇలా మెడికల్ వేస్ట్ అంతా..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  10 Oct 2020 1:51 PM GMT
అలా వర్షం పడింది.. ఇలా మెడికల్ వేస్ట్ అంతా..!

కేవలం కొన్నే కొన్ని గంటలు వర్షం ఆసుపత్రిలో ఉన్న మెడికల్ వేస్ట్ మొత్తం నీటిపై తేలియాడుతూ కనిపించింది. కోవిద్-19 ఐసోలేషన్ వార్డులో ఇలాంటి పరిస్థితి నెలకొంది. సెప్టెంబర్ నుండి కరోనా కేసులు విపరీతంగా పెరుగుతూ ఉండడంతో ఇలా ఆసుపత్రి నీటిలో మునిగిపోయింది. కరెంట్ పోవడంతో ఆసుపత్రిలో ఉన్న తొమ్మిది మంది పేషెంట్స్ ను వేరే చోటుకు తరలించారు. ఆరు మంది కరోనాతో బాధపడుతూ ఉండగా.. ఇంకో ముగ్గురికి ఆక్సిజన్ అవసరం ఉంది.

ఆసుపత్రికి సంబంధించిన విజువల్స్ ఛత్తీస్ఘర్ రాష్ట్రంలోని అంబికాపూర్ నగరంలో చోటు చేసుకుంది. ఛత్తీస్ఘర్ రాజధాని రాయ్ పూర్ కు 333 కిలోమీటర్ల దూరంలో ఈ ఊరు ఉంది. వర్షంతో పాటూ మురికి నీరు కూడా అక్కడ చేరిపోయింది. ఆ నీటిలో మెడికల్ వేస్ట్ తో పాటూ, సేఫ్టీ కిట్స్ కూడా తేలుతూ కనిపించాయి. ఆ రాష్ట్రంలోని ఆసుపత్రుల తీరుకు ఇది అద్దం పట్టేలా ఉందని పలువురు విమర్శిస్తూ ఉన్నారు.

పవర్ బ్యాకప్ కోసం వార్డ్ ఇన్ ఛార్జ్ ఎదురుచూస్తూ ఉండడాన్ని కూడా వీడియోలో చూపించారు. కరోనా వైరస్ కేర్ సెంటర్ ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవడం పట్ల విమర్శలు వస్తూ ఉన్నారు. ఇక్కడే కోవిద్ శాంపుల్స్ ను సేకరించడం, టెస్టింగ్ లు చేస్తుండడం జరుగుతూ ఉంది. ఇలాంటి చోట కనీస జాగ్రత్తలు తీసుకోలేదని పేషెంట్స్ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు.

ఇలాంటి పరిస్థితి కారణంగా పేషెంట్స్ తో పాటూ, మెడికల్ స్టాఫ్ కూడా భయబ్రాంతులకు గురవుతూ ఉన్నారు. కరోనా వైరస్ ఇతరులకు సోకే అవకాశం కూడా ఉందని భావిస్తూ ఉన్నారు. మెడికల్ వేస్ట్ కారణంగా ఇతర రోగాలు కూడా వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

Next Story
Share it