మాస్క్‌లు, శానిటైజర్లు ఆ ధరకే అమ్మాలి..

By అంజి
Published on : 21 March 2020 5:50 PM IST

మాస్క్‌లు, శానిటైజర్లు ఆ ధరకే అమ్మాలి..

ఢిల్లీ: కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రజలందరూ సామాజిక దూరాన్ని పాటించాలని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రజలందరూ ఇళ్లలోనే ఉండాలని, జాగ్రత్తలపై రాష్ట్రాల ఆరోగ్య శాఖ కార్యదర్శులకు సూచనలు చేశామని కేంద్ర ఆరోగ్య సంయుక్త కార్యదర్శి అన్నారు. అవసరమైతే కరోనా పరీక్షల ల్యాబ్‌లు పెంచుతామని లవ్‌ అగర్వాల్‌ అన్నారు.

కాగా భారత్‌లో మాస్క్‌లు, శానిటైజర్‌లకు కేంద్ర ప్రభుత్వం ధరలు ఖరారు చేసింది. మాస్క్‌ల ధరలు రూ.8, రూ.10గా నిర్ణయించింది. 200 ఎంఎల్‌ శానిటైజర్‌ ధర రూ.100 గా నిర్ణయించింది.

భారత్‌లో కరోనా బాధితుల సంఖ్య 306కు చేరింది. మహారాష్ట్రలో అత్యధికంగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇక బెంగళూరులో కరోనా కేసుల సంఖ్య 19కి చేరింది.

అందరూ కలిసికట్టుగా పోరాడితే కరోనాను అరికట్టగలుగుతామని అగర్వాల్‌ అన్నారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా 111 ల్యాబ్‌లు అందుబాటులోకి వచ్చాయన్నారు. అయితే ప్రతి ఒక్కరూ మాస్క్‌లు ధరించాల్సిన అవసరం లేదని, వందతులు నమ్మి ప్రజలు భయభ్రాంతులకు గురికావొద్దన్నారు.

Also Read: జగన్ ప్రభుత్వంపై కేంద్రం చర్యలు తీసుకోవాలి : నారా లోకేష్

ఆదివారం 24 గంటల పాటు జనతా కర్ఫ్యూ పాటిద్దాం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ఆయన శనివారం ప్రగతి భవన్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఆదివారం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు బంద్‌ పాటిద్ధామని కోరారు. అత్యవసర సేవలు మినహా ప్రతీ ఒక్కరూ బంద్‌లో పాల్గొనాలని సూచించారు. మహారాష్ట్ర సరిహద్దు మూసివేయాలని ఆలోచిస్తున్నామని, ప్రభుత్వానికి సమాచారం అందించే మూసివేస్తామన్నారు. 10 ఏళ్లలోపు చిన్నారులు, 60 ఏళ్లు పైబడినవారు 2,3 వారాలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించారు. అత్యవసర పరిస్థితి వస్తే సీపీఎంబీనీ పరీక్షలకు ఉపయోగించుకుంటామని ప్రధాని నరేంద్రమోదీ కోరామని, అందుకు మోదీ కూడా సానుకూలంగా స్పందించారని అన్నారు.

Next Story