జగన్ ప్రభుత్వంపై కేంద్రం చర్యలు తీసుకోవాలి : నారా లోకేష్

యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న కరోనా వైరస్..ఆంధ్రప్రదేశ్ లోకి రాకుండా నివారణ చర్యలు చేపట్టాల్సిందిపోయి..ఏపీలో కరోనా లేదంటూ సీఎం జగన్ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ప్రయత్నం చేశారని ఆరోపించారు టీడీపీ నేత నారా లోకేశ్. తాజాగా విడుదలైన హెల్త్ బులెటిన్ లో ఆంధ్రాలో వైరస్ ఏ స్థాయిలో ఉందో విస్తుపోయే నిజాలను తెలిపిందన్నారు. కరోనా పై నిజాలను ప్రజలకు తెలియకుండా దాచిపెట్టిన జగన్ ప్రభుత్వంపై కేంద్రం చర్యలు తీసకోవాలని లోకేశ్ డిమాండ్ చేశారు.

Also Read : కరోనా వైరస్‌: పారాసిట్‌మల్‌పై డాక్టర్‌ సమరం ఏమన్నారంటే..!

అలాగే కేంద్రమే ఏపీలో కరోనా నివారణ చర్యలు చేపట్టాల్సిందిగా లోకేష్ విజ్ఞప్తి చేశారు. స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న టీడీపీ అభ్యర్థులపై వైసీపీ ప్రభుత్వం, స్థానిక నేతలు తీవ్రస్థాయిలో ఒత్తిడి చేస్తున్నారని నారా లోకేశ్ మండిపడ్డారు. గుంటూరు జిల్లా వినుకొండ వైసీపీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు ఒత్తిడితో శావల్యాపురం టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి గుండెపోటుతో మృతి చెందారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఇతర టీడీపీ అభ్యర్థులపై కూడా ఎమ్మెల్యే ఒత్తిడి చేశారని చెప్పుకొచ్చారు. టీడీపీతో పోటీ చేసి గెలవలేక వైసీపీ నేతలు ఇలాంటి ఏడుపులు ఏడుస్తున్నారని వాపోయారు లోకేశ్.

Also Read : ఆమె చేసిన పనికి నెటిజన్లు ఫిదా..

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *