ముఖ్యాంశాలు

  • ఖైరతాబాద్‌లోని ఆర్యవైశ్య భవన్‌లో ఉరేసుకున్న మారుతీరావు
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన మారుతీరావు భార్య
  • మారుతీరావు స్వస్థలం నల్గొండ జిల్లా మిర్యాలగూడ

హైదరాబాద్‌: మిర్యాలగూడ ప్రణయ్‌ హత్య కేసు నిందితుడు మారతీ రావు ఆత్మహత్యకు పాల్పడడం తీవ్ర కలకలం రేపుతోంది. ఖైరతాబాద్‌లోని ఆర్యవైశ్యభవన్‌లో మారుతీరావు విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడని ఓ మీడియా సంస్థ తెలిపింది. నిన్న రాత్రి ఆర్యవైశ్య భవన్‌లో మారుతీ రావు బస చేశాడు. ఈ ఘటనపై మారుతీరావు భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. మృతుడి స్వస్థలం నల్గొండ జిల్లా మిర్యాలగూడ. కూతురు అమృతను ప్రేమ వివాహం చేసుకున్నాడని ప్రణయ్‌ని మారుతీరావు చంపించినట్టు ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. ప్రణయ్‌ హత్య కేసులో మారుతీరావు బెయిల్‌ మీద బయటకు వచ్చాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మారుతీరావు ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.