బిగ్ బ్రేకింగ్: అమృత తండ్రి మారుతీరావు ఆత్మహత్య
By అంజి Published on 8 March 2020 9:10 AM ISTముఖ్యాంశాలు
- ఖైరతాబాద్‌లోని ఆర్యవైశ్య భవన్‌లో ఉరేసుకున్న మారుతీరావు
- పోలీసులకు ఫిర్యాదు చేసిన మారుతీరావు భార్య
- మారుతీరావు స్వస్థలం నల్గొండ జిల్లా మిర్యాలగూడ
హైదరాబాద్: మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసు నిందితుడు మారతీ రావు ఆత్మహత్యకు పాల్పడడం తీవ్ర కలకలం రేపుతోంది. ఖైరతాబాద్‌లోని ఆర్యవైశ్యభవన్‌లో మారుతీరావు విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడని ఓ మీడియా సంస్థ తెలిపింది. నిన్న రాత్రి ఆర్యవైశ్య భవన్‌లో మారుతీ రావు బస చేశాడు. ఈ ఘటనపై మారుతీరావు భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. మృతుడి స్వస్థలం నల్గొండ జిల్లా మిర్యాలగూడ. కూతురు అమృతను ప్రేమ వివాహం చేసుకున్నాడని ప్రణయ్‌ని మారుతీరావు చంపించినట్టు ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. ప్రణయ్ హత్య కేసులో మారుతీరావు బెయిల్ మీద బయటకు వచ్చాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మారుతీరావు ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Next Story