Fact Check : స్వాతంత్య్ర దినోత్సవం నాడు నీలం రంగు జెండాను ఎగురవేశాడని పోలీసులు చితక్కొట్టారా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  19 Aug 2020 9:44 AM GMT
Fact Check : స్వాతంత్య్ర దినోత్సవం నాడు నీలం రంగు జెండాను ఎగురవేశాడని పోలీసులు చితక్కొట్టారా..?

74వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని భారతీయలు ఇటీవలే జరుపుకున్నారు. లాక్ డౌన్ నిబంధనలు అమలులో ఉండడంతో పెద్ద ఎత్తున నిర్వహించుకోకుండా తక్కువ మందితో పలు చోట్ల స్వాత్రంత్య్ర దినోత్సవ సంబరాలను నిర్వహించారు. ఆ రోజు జాతీయ జెండాను ఎగురవేయకుండా నీలం రంగు జెండాను ఎగురవేశాడని ఓ వ్యక్తిని పోలీసులు కొట్టారంటూ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

P1

నిజ నిర్ధారణ:

స్వాతంత్య్ర దినోత్సవం నాడు నీలం రంగు జెండాను ఎగురవేయడంతో ఓ వ్యక్తిని పోలీసులు కొట్టారు అంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో 'నిజం లేదు'.

వైరల్ అవుతున్న పోస్టుకు సంబంధించిన వీడియోల స్క్రీన్ షాట్ తీసుకోగా.. ఈ పోస్టు మార్చి నెల నుండి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

భారత్ లో లాక్ డౌన్ ను అమలు చేసిన సమయంలో విచ్చల విడిగా రోడ్ల మీద తిరుగుతున్న వారిపై పోలీసులు కన్నెర్ర చేశారు. లాక్ డౌన్ నియమ నిబంధనలను పాటించని వారిని రోడ్డు మీద కొట్టారు. ఆ వీడియోనే ఇది కూడా..! ఆ వీడియోలో వెనుక ఓ జెండా ఉండడంతో ఆగష్టు 15న ఇది జరిగిందంటూ పలువురు పోస్టులు ఈ మధ్య పోస్టులు పెడుతున్నారు.

గతంలో కూడా ఈ వీడియోను పలువురు షేర్ చేశారు. లాక్ డౌన్ నిబంధనలను అతిక్రమిస్తే ఇలానే జరుగుతుందని తెలియజేసారు.

https://www.dailymotion.com/video/x7sz5f8

ఇమేజ్ మ్యాగ్నిఫయర్ ను ఉపయోగించి ఆ వీడియోను బాగా పరిశీలించగా.. మహారాష్ట్ర పోలీసులకు సంబంధించిన వాహనమని స్పష్టమవుతోంది.

P2

అంతేకానీ.. స్వాతంత్య్ర దినోత్సవం నాడు నీలం రంగు జెండాను ఎగురవేసినందుకు ఆ వ్యక్తిని పోలీసులు కొట్టలేదు. ఈ వీడియో మార్చి నెల నుండి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

Next Story