Fact Check : భారత ఆర్మీ చైనా సైనికులపై గ్రెనేడ్స్ తో దాడి చేసిందా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  19 Aug 2020 8:28 AM GMT
Fact Check : భారత ఆర్మీ చైనా సైనికులపై గ్రెనేడ్స్ తో దాడి చేసిందా..?

Irmak Doya అనే ట్విట్టర్ అకౌంట్ లో భారత్ ఆర్మీ చైనా సైనికుల మీద గ్రెనేడ్స్ తో దాడి చేసిందంటూ పోస్టులు పెట్టారు. సిలిగురి కారిడార్ వద్ద ఎల్.ఏ.సి. వద్ద ఈ ఘటన జరగగా.. చైనా ఎదురుదాడి చేయడంతో భారత్ కు చెందిన సైనికులు 33 మందికి పైగా మరణించారు.

“Indian troops unprovoked fired on LAC near Siliguri corridor and attacked the Chinese army with grenades. China retaliated by killing 33 IND soldiers and many injured. The rest of the IND soldiers left their military equipment & ran away. Now PLA controlled siliguri corridor (sic).” అంటూ ట్వీట్ చేయగా.. ఆ తర్వాత డిలీట్ చేశారు.

A1

ఎల్.ఏ.సి. కు దగ్గరగా ఉన్న సిలిగురి కారిడార్ లో చైనా సైనికుల మీద భారత్ ఆర్మీ గ్రెనేడ్స్ తో విరుచుకుపడింది.. దీంతో స్పందించిన చైనా ఆర్మీ భారత సైనికుల మీద ఎదురుదాడి చేసింది. 33 మంది భారత సైనికులు మరణించారు. భయపడిపోయిన భారత సైనికులు ఆయుధ సామాగ్రిని అక్కడే వదిలేసి పారిపోయింది. ఆ ప్రాంతాన్ని చైనా ఆర్మీ స్వాధీనం చేసుకుంది అంటూ ట్వీట్ లో చెప్పుకొచ్చారు. ఈ ట్వీట్ కు సంబంధించిన స్క్రీన్ షాట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

నిజ నిర్ధారణ:

భారత జవాన్లు చైనా సైనికుల మీద గ్రెనేడ్స్ తో దాడి చేశారన్నది 'పచ్చి అబద్ధం'

ఆ ట్వీట్ లో ఉన్న ఫోటోలను గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా అది చైనా సెంట్రల్ టెలివిజన్(సిసిటివి) కి చెందిన వీడియోకు సంబంధించినది. ఆ వీడియో లోని స్క్రీన్ షాట్స్ ను తీసుకుని ఆ ట్వీట్ లో పోస్టు చేశారు.

2020 జూన్ నెలలో 20 మంది భారత సైనికులు చైనా సైనికులతో జరిగిన గొడవలో మరణించారు. లడఖ్ లోని గల్వాన్ లోయలో ఇరు దేశాల సైనికుల మధ్య చోటు చేసుకున్న గొడవలో చైనా సైనికులు కూడా పెద్ద సంఖ్యలో మరణించారు. ఆ తర్వాత ఇరు దేశాల నేతలు, అధికారులు కలిసి చర్చించి సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా నిర్ణయం తీసుకున్నారు.

చైనా పబ్లిక్ బ్రాడ్ కాస్టర్ అయిన సిసిటివి ఆ వీడియోలో చైనా వద్ద ఉన్న అత్యుత్తమ ఆయుధాలను వీడియో తీసింది. టిబెటన్ పీఠభూమి వద్ద చైనా ఆర్మీ ఈ రిహార్సల్స్ ను చేసింది. ఎలాంటి వాటికైనా ఎదురొడ్డి నిలబడగలం, ఎవరినైనా అణచివేయగలం అని ప్రపంచానికి తెలియజేయడానికే ఈ వీడియోలను వదిలింది చైనా.

A2

ఈ ఫోటో, వార్తా కథనం కూడా ఆ రిహార్సల్స్ కు సంబంధించినదే..!

అంతేకానీ భారత సైనికులు చైనా ఆర్మీ మీద దాడి చేశారంటూ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి 'నిజం లేదు'. గల్వాన్ లోయలో భారత్-చైనా దేశాల మధ్య గొడవ జరిగిన తర్వాత చైనా ఈ వీడియోలను రిలీజ్ చేసింది.

Next Story