అండర్ వేర్ కుట్టమంటే సరిగా కుట్టని టైలర్.. పోలీసులను ఆశ్రయించిన దూబే..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  18 July 2020 10:02 AM GMT
అండర్ వేర్ కుట్టమంటే సరిగా కుట్టని టైలర్.. పోలీసులను ఆశ్రయించిన దూబే..!

తమకు న్యాయం చేయాలని ఎంతో మంది ఎన్నో సమస్యలతో పోలీసులను ఆశ్రయిస్తూ ఉంటారు. కానీ ఓ వ్యక్తి చాలా పర్సనల్ విషయమై పోలీసులను ఆశ్రయించాడు. ఇంతకూ ఆ వ్యక్తి పోలీసులను ఆశ్రయించడానికి ముఖ్య కారణం ఏమిటో తెలుసా..? టైలర్ అతడి అండర్ వేర్ సరిగా కుట్టకపోవడమే..!

నమ్మలేకపొతున్నారు కదూ.. ఇది నిజంగా చోటుచేసుకున్న వింత ఘటన. భోపాల్ లో ఓ వ్యక్తి తాను చెప్పినట్లుగా స్థానిక టైలర్ కుట్టలేదని.. ఎందుకు నేను చెప్పినట్లుగా కుట్టలేదు.. అని అడిగాడు. టైలర్ నుండి సరైన స్పందన రాకపోవడంతో పోలీసులను ఆశ్రయించాడు.

46 సంవత్సరాల కృష్ణ కుమార్ దూబే స్థానిక టైలర్ కు అండర్ వేర్ కుట్టమని రెండు మీటర్ల వస్త్రాన్ని ఇచ్చాడు. అతడు చెప్పినట్లుగా కుట్టలేదట.. తాను చెప్పిన దానికంటే చిన్నగా కుట్టాడు. ఎందుకు ఇలా కుట్టావు.. సరిగా కుట్టమని దూబే అడిగినప్పటికీ టైలర్ అందుకు ఇప్పుకోకపోవడంతో పోలీసుల దగ్గరకి ఈ పంచాయతీని తీసుకుని వచ్చాడు. 'నేను టైలర్ కు రెండు మీటర్ల వస్త్రాన్ని ఇచ్చి అండర్ వేర్ కుట్టమని అడిగాను.. కానీ చెప్పిన దాని కంటే చిన్నగా అండర్ వేర్ ను కుట్టాడు.. తిరిగి కుట్టు అని అడగగా కుట్టలేదు.. అంతే కాదు కుట్టడానికి 70 రూపాయలు అడిగాడు.. ఇచ్చాను కూడా.. నాడాను కూడా మళ్ళీ కొనుక్కుని వచ్చాను.. అయినా కూడా అండర్ వేర్ చిన్నగా కుట్టించాడు' అని దూబే మీడియాతో తన భాధను చెప్పుకున్నాడు.

దూబే సెక్యూరిటీ గార్డుగా పని చేస్తూ ఉండేవాడు. లాక్ డౌన్ సమయంలో ఉద్యోగాన్ని కోల్పోయాడు. ఇల్లు గడవడానికి చాలా కష్టమవుతోంది.. ఈ మధ్యనే 1000 రూపాయలు స్నేహితుడి దగ్గర నుండి అప్పుగా తీసుకున్నానని చెప్పాడు దూబే. పోలీసులు అతడి ఫిర్యాదును స్వీకరించారు.. స్థానిక కోర్టును సంప్రదించాల్సిందిగా కోరారు.

Next Story