అదృష్టం అంటే ఇతడిదే.. పోయిన పర్సు 14ఏళ్ల తరువాత దొరికింది

By తోట‌ వంశీ కుమార్‌  Published on  10 Aug 2020 2:47 PM IST
అదృష్టం అంటే ఇతడిదే.. పోయిన పర్సు 14ఏళ్ల తరువాత దొరికింది

పోగొట్టుకున్న వస్తువులు దొరకాలంటే అదృష్టం ఉండాలి అంటారు. కొన్ని సార్లు పొగొట్టుకున్నది రోజుల్లో, వారాల్లో, నెలల్లో దొరకొచ్చు.. కానీ ఓ వ్యక్తి పొగొట్టుకున్న వస్తువు 14 ఏళ్ల తరువాత దొరకింది. అవును ఇది నిజం. ఈ విషయాన్ని అతడు కూడా నమ్మలేకపోయాడు. ఇంతకీ అతను పొగొట్టుకున్నది ఏంటి అంటారా..? అది ఓ పర్సు. ఇంకా విచిత్రం ఏంటంటే..? అందులో అతడు ఉంచిన నగదు కూడా అలాగే ఉందట. ఈ ఘటన ముంబైలో జరిగింది.

వివరాల్లోకి వెళితే.. 2006 సంవత్సరంలో హేమంత్ పడాల్కర్ అనే వ్యక్తి ముంబై లోకల్‌ ట్రైన్‌ ఎక్కాడు. ట్రైన్ చాలా రద్దీగా ఉంది. చత్రపతి శివాజీ మహారాజ్‌ టెర్మినల్‌ నుంచి పాన్వెల్‌కి ప్రయాణించాడు. ట్రైన్ దిగిన తరువాత చూసుకుంటే.. ప్యాంట్‌ జోబులో ఉన్న పర్సు కనిపించలేదు. అందులో రూ.900 ఉన్నాయి. వెంటనే రైల్వే పోలీసులకు వద్దకు వెళ్లి తన పర్సు చోరీ చేశారని ఫిర్యాదు చేశాడు. ట్రైన్‌ రద్దీగా ఉండడంతో తన పర్సు.. దొరకదని బావించాడు. ఆ తరువాత ఆ విషయాన్ని కూడా మరిచిపోయాడు. అయితే.. 14ఏళ్ల తరువాత ఈ ఏడాది ఏప్రిల్‌లో ముంబై పోలీసుల నుంచి హేమంత్‌కు ఫోన్‌ కాల్‌ వచ్చింది. వారు చెప్పింది విని ఆశ్చరపోయాడు. మీ పర్సు దొరికింది వచ్చి తీసుకెళ్లండి చెప్పారు.

లాక్‌డౌన్‌ కావడంతో అప్పుడు వెళ్లలేకపోయాడు. తాజాగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి చూస్తే.. ఆపర్సు తనదే. అందులో అతడు చెప్పినట్లే రూ.900 లే ఉన్నారు. రద్దు అయిన పాత రూ.500నోటును పోలీసులు తీసుకుని అతడికి రూ.300 ఇచ్చారు. ఆ నోటును మార్చి అతడికి అకౌంట్‌లో జమచేస్తామని చెప్పారు. మరో రూ.100 స్టాంప్‌ పేపర్‌ వర్క్‌ కోసం తీసుకున్నారు. ఓ దొంగను అరెస్టు చేయగా ఈ పర్సు దొరికినట్లు పోలీసులు చెప్పారు.

Next Story