భారత మాజీ రాష్ట్రపతి ప్ర‌ణ‌బ్‌ముఖర్జీకి క‌రోనా పాజిటివ్‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  10 Aug 2020 8:35 AM GMT
భారత మాజీ రాష్ట్రపతి ప్ర‌ణ‌బ్‌ముఖర్జీకి క‌రోనా పాజిటివ్‌

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఈ మహమ్మారి ఎవ్వరిని వదలడం. ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు, సినీ సెలబ్రిటీలు ఈ మహమ్మారి భారీన పడగా.. తాజాగా భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ కరోనా బారీన పడ్డారు. సోమరవారం నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఆయనకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. 'కరోనా పరీక్షల్లో నాకు పాజిటివ్‌ అని తేలింది. గత వారం రోజులుగా నన్ను కలిసిన వారంతా ద‌య‌చేసి ఒంట‌రిగా (హోం ఐసోలేష‌న్‌)లో ఉండాల‌ని మ‌రియు క‌రోనా వైర‌స్ నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని అభ్య‌ర్థిస్తున్నాను' అంటూ ట్వీట్ చేశారు.



గడిచిన 24 గంటల్లో 62,064 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 1,007 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీటితో కలిపి దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 22,15,074కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో 15,37,744 మంది కోలుకోని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కాగా.. 6,34,945 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక ఈ మహమ్మారి బారిన పడి ఇప్పటి వరకు 44,386 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇక దేశంలో రికవరి రేటు 69 శాతం ఉండగా.. మరణాల రేటు 2 శాతంగా ఉంది

Next Story