ముంబై నార్కోస్.. ఆయుర్వేదానికి చెందిన వెదురు బొంగులంటూ వచ్చిన పార్సెల్ లో ఏమున్నాయంటే..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  10 Aug 2020 6:52 AM GMT
ముంబై నార్కోస్.. ఆయుర్వేదానికి చెందిన వెదురు బొంగులంటూ వచ్చిన పార్సెల్ లో ఏమున్నాయంటే..?

1000 కోట్ల విలువైన భారీ స్మగ్లింగ్ రాకెట్ ను ముంబైలో అధికారులు పట్టుకున్నారు. 191 కేజీల హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ 1000 కోట్ల రూపాయలని తెలుస్తోంది. నవీ ముంబై లోని నహవా శీవా(Nhava Sheva) పోర్టులో శనివారం రాత్రి భారీ స్థాయిలో హెరాయిన్ ను పట్టుకున్నారు అధికారులు. కస్టమ్స్ అధికారులు, డైరెక్టరేట్ నాగ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డిఆర్ఐ) అధికారులు ఈ జాయింట్ ఆపరేషన్ ను నిర్వహించారు. ఆఫ్ఘనిస్థాన్ నుండి ఇరాన్ మీదుగా ముంబైకి ఈ డ్రగ్స్ ను తరలించినట్లు తెలుస్తోంది.

ఈ కేసుకు సంబంధించి ఇద్దరినీ అధికారులు పట్టుకున్నారు. వారిని 14 రోజుల పోలీసు కస్టడీకి తరలించారు.

ఈ డ్రగ్స్ ను భారత్ లోకి తరలించడంలో తెలివిని ప్రదర్శించారు స్మగ్లర్లు. ప్లాస్టిక్ పైపులను తీసుకుని వాటికి ఆకుపచ్చ పెయింట్ వేశారు. అందులోకి హెరాయిన్ ను కుక్కారు. అధికారులతో ఆయుర్వేదిక్ మెడిసిన్లలో ఉపయోగించే వెదురుగా చూపించి బురిడీ కొట్టించాలని అనుకున్నారు. కానీ అధికారులకు అనుమానం రావడంతో పరిశీలించారు. తీరా లోపల చూస్తే హెరాయిన్ డ్రగ్స్ అని గుర్తించారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న ఇద్దరు కస్టమ్స్ హౌస్ ఏజెంట్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీకి చెందిన ఫైనాన్షియర్, మరో నలుగురికి ఈ డ్రగ్స్ డెలివరీతో సంబంధం ఉందని భావిస్తూ ఉన్నారు. వారిని కూడా అధికారులు విచారించనున్నారు.

Next Story
Share it